బాలీవుడ్ పైనే భారం.. " హరిహర వీరమల్లు " ఆశలు నెరవేరేనా ?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు'. మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ మూవీని.. జ్యోతి కృష్ణ ఫినిష్ చేశారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. బాబీ డియోల్ ఔరంగజేబుగా చేశారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందించగా, సినిమాకు గ్రాండియర్ విజువల్ ప్రెజెంటేషన్‌ ఉండేలా చేసినా, విడుదల తర్వాత ఫీడ్‌బ్యాక్‌ మాత్రం మిశ్రమంగా ఉంది. ఇటీవలే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.

కొత్త వెర్షన్..

మొదట్లో ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా.. vfx విషయంలో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. భారీ బడ్జెట్ తో వచ్చిన మూవీలో ఈ తరహా గ్రాఫిక్స్ ఏంటని గట్టిగా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమాపై వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను సీరియస్‌ గా పరిగణిస్తామని స్పష్టం చేశారు. వీఎఫ్ఎక్స్ లోపాలను కూడా సరిచేస్తామని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ను సరిచేసి.. సెకండాఫ్ నిడివిని కొంత తగ్గించారు. కొత్త వెర్షన్ ఇప్పటికే థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు.

pawan-kalyan-harihara-veeramallu-hopes-on-hindi-release-and-collections

తగ్గిన టికెట్ రేట్లు..

అంతే కాకుండా సినిమా విడుదల సందర్భంగా సింగిల్‌ స్క్రీన్‌, మల్టీప్లెక్స్‌ లలో టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. అయితే ఇప్పుడు సాధారణ టికెట్ల ధరలు అమల్లోకి వచ్చేశాయి. గత రెండు రోజుల నుంచి ఈ ధరలకే టికెట్లు లభిస్తున్నాయి.

కలెక్షన్స్..

సినిమా మొదటిరోజు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.12.75 కోట్లు.. మొదటి రోజు మొత్తం రూ.34.75 కోట్లు వసూలు చేసి పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్‌ను సాధించింది. కానీ తరువాతి రోజుల్లో కలెక్షన్లు క్రమంగా పడిపోవడం ప్రారంభమైంది. ఐదవ రోజున కేవలం రూ.2.1 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అయినా చేరుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ జులై 31వ తేదీన విడుదల అవ్వనుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. వీరమల్లు కలెక్షన్స్ కి మరింత గండిపడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

pawan-kalyan-harihara-veeramallu-hopes-on-hindi-release-and-collections

ఆశలన్నీ బాలీవుడ్ పైనే..

అయితే ఈ చిత్రం హిందీ వెర్షన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. అయితే డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఓ ఇనట్వ్యూలో మాట్లాడుతూ.. ఆగస్టు 1 న మూవీ హిందీలో గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. నార్త్ ఇండియాలో మొదటిరోజు తెలుగు వెర్షన్‌నే విడుదల చేయగా.. అక్కడి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. హిందీలో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని.. ఔరంగజేబు కాలంలో హిందువులపై జరిగిన దాడులను బోల్డ్‌గా చూపించిన చిత్రం ఇదేనని చెప్పుకొచ్చారు. అందుకే తెలుగులో కన్నా హిందీలో వసూళ్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ రకంగా అయినా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తే నిర్మాత సేఫ్ అవుతారని టాక్ నడుస్తోంది.

హిందీలోనూ ప్రమోషన్స్..

కాగా పవన్ కళ్యాణ్‌ తెలుగు వెర్షన్ కోసం చేసిన ప్రమోషన్స్ హిందీలోనూ కొనసాగిస్తే.. హిందీ ప్రేక్షకులకు మరింతగా రీచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బాబీ డియోల్ వంటి వారితో కూడా ప్రమోషన్స్ చేయించడం బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+