గుమ్మడికాయ కొట్టేసిన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' టీం.. న్యూ అప్డేట్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాయిదా విషయంలో ఇప్పటికే రికార్డు కొట్టింది ఈ మూవీ. దాదాపు 12 సార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై చిత్ర యూనిట్ ఓ అప్డెట్ ఇచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందని ప్రకటించింది.
మిగిలి ఉన్న రెండు రోజుల షూటింగ్ ని పవన్ కళ్యాణ్ ఫినిష్ చేసేశారు. ఈ సందర్భంగా, చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక ఫోటోను విడుదల చేసింది. సెట్స్‌లో పవన్ కళ్యాణ్‌తో టెక్నికల్ టీమ్ కలిసి దిగిన ఈ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో మొత్తానికి నిరీక్షణకు తెరపడిందని మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం, పవన్ కళ్యాణ్ తన కమిట్మెంట్స్‌ను పూర్తి చేశారు.

ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి.. వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అంటున్నారు. ట్రైలర్ రిలీజ్ రోజే సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.
Powerstar @PawanKalyan Garu finishes shooting for #HariHaraVeeraMallu ⚔️
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 6, 2025
The shoot wraps with a bang, and what’s coming next will set screens on fire! 💥💥
A MASSIVE trailer and Blockbuster songs are on the way! 🔥🔥@AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/47u3JMPcSk












Click it and Unblock the Notifications