అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ సెటైర్లు..స్మగ్లింగ్ చేస్తారంటూ కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సినిమా హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి 40 ఏళ్ల క్రితం హీరోలు అడువులను కాపాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేశారని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా ,అల్లు కుటుంబాల మధ్య మాటల్లేవనే చర్చ సాగుతోంది. మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.

pawan kalyan indirect comments on allu arjun

మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తోందని అల్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. జులై 20న మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బర్త్ డే విషెష్ చెప్పకపోవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప మొదటి పార్ట్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనగాను జాతీయ ఉత్తమ అవార్డు కూడా దక్కింది. ఈక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టినట్టు అయిందని సినీ, రాజకీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+