పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ ఫస్ట్ సాంగ్ లీక్.. వీడియో వైరల్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (OG)". ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన విలన్‌గా కనిపించనుండగా.. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తమన్ ప్రాంక్ - వీడియో వైరల్..
మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఆగస్టు 2న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో పవన్ అభిమానుల్లోఫుల్ జోష్ నెలకొంది. అయితే ఈ సింగిల్ గురించి సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ప్రాంక్ చేయడంతో మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
ఈ మేరకు తమన్.. సుజిత్‌కు ఫోన్ చేసి - "ఫస్ట్ సింగిల్ లీక్ అయింది... ఎవరో షేర్ చేశారు" అంటూ ప్రాంక్ చేశాడు. ముందుగా షాక్ అయిన సుజిత్, "మన టీం లో ఎవరో లీక్ చేసి ఉండొచ్చు" అని స్పందించగా.. తమన్ మరింతగా టెన్షన్ పెంచేలా నటించాడు. అయితే చివరకు ఈ మొత్తం విషయంలో తమన్ ప్రాంక్ చేశాడని వెల్లడించి నవ్వించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
#OG First Single Leaked Online 🤯
— Movies4u Official (@Movies4u_Officl) August 1, 2025
Thaman Prank Call to Sujeeth 😂👌#PawanKalyan pic.twitter.com/OR6pB6Uwbn
OGపై భారీ అంచనాలు..
అయితే "హరిహర వీరమల్లు" సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ అభిమానులు.. "ఓజీ" సినిమా పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, పవన్ స్టైల్, యాక్షన్ మేనరిజంలకు ఫుల్ డోస్‌గా ఉంటుందని సమాచారం. అటు టేకింగ్, మ్యూజిక్, విజువల్స్ పరంగా కూడా "ఓజీ" ఒక క్రేజీ ప్రాజెక్టుగా నిలవబోతుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications