పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ??
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది. మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. పవన్ కళ్యాణ్‌ను ఎప్పటినుంచో ఎలా చూడాలనుకుంటున్నారో, అలానే చూపించారని ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. D.V.V. దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
అలానే పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తన పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో పెద్ద ప్లస్ అని చెప్పాలి. అలాగే ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, శుభలేఖ సుధాకర్ వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. కాగా ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించడంతో పార్ట్ 2 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సీక్వెల్ కి "ఓజస్ గంభీర - రాంపేజ్ బిగిన్స్" అనే టైటిల్ తో పార్ట్ 2 పనులు మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని చెబుతున్నారు. మొదటి భాగం హిట్ కావడంతో సీక్వెల్‌ను అంతకు మించిన భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కథ మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
మరోవైపు మొదట ఈ సినిమాకు సీక్వెల్ రానుందని ప్రచారం జరిగినా, దర్శకుడు సుజీత్ మాత్రం అది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అని క్లారిటీ ఇచ్చారు. సుజీత్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రీక్వెల్ కథలో Subhas Chandra Bose జీవితం, ముఖ్యంగా ఆయన భారతీయులను జపాన్‌కు తీసుకెళ్లిన కాలానికి సంబంధించిన సంఘటనలు ఉంటాయని టాక్. ఈ కథను ఫిక్షన్, రియల్ హిస్టరీ మిక్స్ చేస్తూ పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ప్రీక్వెల్‌లో అమితాబ్ బచ్చన్ ను నేతాజీ పాత్ర కోసం తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే పవన్ కళ్యాణ్ పాత్రకు తండ్రిగా రామ్ చరణ్ కనిపించనున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ కాస్టింగ్ నిజమైతే, సినిమా పై అంచనాలు మరింత పెరగడం ఖాయం. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ టాక్ ఏమిటంటే, సుజీత్ తెరకెక్కించిన "సాహో" సినిమాతో కూడా ఈ కథకు లింక్ చేయగా.. అందుకు సంబంధించిన మరిన్ని సన్నివేశాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
లెజెండరీ గాయని "ఆశాభోస్లే" ఎవరి పాటలు వింటారో తెలుసా..?












Click it and Unblock the Notifications