Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మనల్ని ఎవడ్రా ఆపేది.. ముందుగానే వచ్చేస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" !!

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఆయన సినిమాలకు హిట్, ఫ్లాప్ లతో సంబంధం ఉండదంటే అతిశయోక్తి కాదు. అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మార్చి 26న విడుదల చేయనున్నారు.

కాగా లేటెస్ట్ గానే ఈ చిత్రానికి సంబంధించి తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేసేశారు పవర్ స్టార్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది.

pawan-kalyan-usthad-bhagath-singh-may-pre-pone-release-to-march-19-and-news-got-viral

దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనుండడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.

కాగా ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే మార్చి రేసులో ఉన్న 'పెద్ది', 'ప్యారడైజ్', 'టాక్సిక్' వంటి సినిమాలు వాయిదా పడటంతో బాక్సాఫీస్ ఖాళీ అయింది. మార్చి 26న 'పెద్ది' రావాల్సి ఉండగా.. 27కు 'ప్యారడైజ్' షెడ్యూల్ అయింది. కానీ ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటి వాయిదా పడ్డాయి. 'పెద్ది'ని ఏప్రిల్ 30కి షెడ్యూల్ చేయగా.. ది ప్యారడైజ్ పూర్తిగా వేసవి రేసు నుంచి తప్పుకుని ఆగస్టుకు వాయిదా పడిపోయింది. ఇక 'కేజీఎఫ్-2' తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న వస్తుందా రాదా అనే అనుమానాలు కలిగినప్పటికీ.. టీం పక్కాగా అదే డేటుకు రాబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.

కానీ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో యుద్ధం నడుస్తుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. అలానే ముందు నుంచి మార్చి 19కే అనుకున్న 'డెకాయిట్' సైతం వాయిదా పడింది. మరోవైపు 'దురంధర్-2' కూడా పక్కా వస్తుందో లేదో అన్న డౌట్లు కొడుతున్నాయి. దాంతో మార్చి 26 విడుదల ప్లాన్ చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఒక వారం ముందు అంటే మార్చి 19 వచ్చేందుకు సన్నాహాల్లో ఉన్నట్టు ఫ్రెష్ అప్డేట్. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లకు ప్రాధమిక సమాచారం వెళ్లిపోయిందని విశ్వసనీయ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మార్చి మూడో వారం లాంగ్ వీకెండ్. ఉగాది, రంజాన్ పండగతో కోలాహలంగా ఉంటుంది.

దాంతో టాక్సిక్ సహా మిగతా సినిమాల కోసం ఉంచిన థియేటర్లు ఖాళీగా ఉంటాయి. వాటిని మొత్తంగా దురంధర్ 2కి కట్టబెట్టినా ఉపయోగం ఉండదని.. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని రంగంలోకి దించితే భారీ ఓపెనింగ్స్ ఖాయమని టాక్ నడుస్తోంది. దురంధర్ 2 వచ్చినా కూడా మన ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు దానికి దూరంగా ఉంటారు కాబట్టి ఆ ఛాన్స్ వదులుకునేందుకు పవన్ మోపవీ నిర్మాతలు సిద్ధంగా లేరని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+