OG Critic Review: అంతే బాగానే ఉంది..నీపైనే నమ్మకం లేదు దొర
తెలుగు సినిమా ప్రపంచంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలను నమోదు చేయలేకపోయాయి. అయినప్పటికీ పవన్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పవన్ కల్యాణ్ తాజాగా నటించిన చిత్రం'ఓజీ'. పవన్ కల్యాణ్ సినీ ప్రస్థానంలో ఏ సినిమాకు లేనంత భారీ అంచనాలు 'ఓజీ' సినిమాపై పెరిగిపోయాయి. 'సాహో' ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.గతంలో పవన్ కల్యాణ్ చేయని ఒక విభిన్నమైన యాక్షన్-కథాంశంతో వస్తుందని ఊహించవచ్చు.
ఈ సినిమా కథ మొత్తం ముంబైలోని ఒక గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. 'ఓజీ' టైటిల్‌తోనే సినిమాలోని కథాంశంపై ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులను సృష్టించి, సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమేర్ సంధూ తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

'ఓజీ' పవర్ ప్యాక్డ్‌గా ఉంది. ఇదొక మాస్ సినిమా. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. అలాగే చివరి 20 నిమిషాల సినిమా అభిమానులకు కిక్ ఇస్తుందని, సినిమాకు ఆ సీన్లే ప్రాణం పోశాయని ఉమైర్ సంధు తన ట్విట్‌లో చెప్పుకొచ్చాడు. అయితే ఇతను చెప్పిన రివ్యూలు చాలానే తప్పుగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. గతంలోఉమేర్ సంధూ సూపర్ హిట్ అని చెప్పిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. దీంతో ఉమేర్ సంధూ రివ్యూపై ఎవరూ నమ్మకాలు పెట్టుకోవద్దని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
First Review #TheyCallHimOG from Censor Board!! #PawanKalyan & #EmraanHashmi SOLID COMEBACK 👌! Go for it !! pic.twitter.com/kg97kdWCaI
— Umair Sandhu (@UmairSandu) September 21, 2025
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, శ్రియా రెడ్డి ప్రత్యేక పాత్రలో నటించారు.ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. బుధవారం అర్థరాత్రి నుంచే 'ఓజీ' ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. 'ఓజీ' సినిమాతో పవన్ కల్యాణ్ బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications