ప్రభాస్ కు పర్ఫెక్ట్ జోడీ .. ఇమాన్వీ బ్యాక్ గ్రౌండ్ కు ఫ్యాన్స్ ఫిదా!!

ప్రభాస్ డైరెక్టర్ హను రాఘవపూడి హిస్టారికల్ లవ్ స్టోరీ శనివారం ప్రారంభమైంది. ఈ సినిమాలో సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమా ప్రారంభోత్సవ ఈవెంట్లో ప్రభాస్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చిన ఇమాన్వి బ్యాగ్రౌండ్ ఏంటి ప్రభాస్ పక్కన జోడిగా ఎలా ఉంటుంది అన్నది నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ పెట్టారు.

ప్రభాస్ సరసన ఇమాన్వి .. ఫ్యాన్స్ ఫిదా
ప్రభాస్ సరసన అవకాశం దక్కించుకున్న ఇమాన్వి ఇస్మాయిల్ ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఈ హీరోయిన్ చేసిన రీల్స్ చూసిన అభిమానులు అమ్మడి డాన్సింగ్ టాలెంట్ కు, ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అవుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ స్మైల్ కు తగ్గ జోడి దొరికిందని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇమాన్వి ఎక్స్ప్రెషన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

Perfect Jodi for Prabhas Fans Fida with Imanvi ismail Background

అగ్ర కథానాయికలను కాదని ఇమాన్వీ ఎంపిక
నిన్న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా వీరిద్దరూ కలిసి ఉన్న వీడియోను అభిమానులు క్రేజీగా ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇద్దరి జోడి బాగుందని కితాబిస్తున్నారు. ప్రభాస్ తో తీస్తున్న హిస్టారికల్ లవ్ స్టోరీ సినిమా కోసం బాలీవుడ్, టాలీవుడ్ అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. ప్రధానంగా మృణాల్ ఠాకూర్, అలియాభట్ ల పేర్లు వినిపించగా వారందరినీ పక్కనపెట్టి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఇమాన్విని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.

ఇమాన్వీ బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఈ ఎంపికతో ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా లవర్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ప్రభాస్ తో సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న అమ్మడి బ్యాక్ గ్రౌండ్ కోసం జనాలు నెట్టింట తెగ వెతుకుతున్నారు. ఎలాంటి సినీనేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన ఇమాన్వి సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యారు. ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి మంచి డాన్సర్. వెస్ట్రన్ మాత్రమేకాదు కూచిపూడి, భరతనాట్యం కూడా చేస్తుంది.

ఓవర్ నైట్ లో ఇమాన్వీకి లక్షల ఫాలోయర్స్
విదేశాలలో డాన్స్ లో శిక్షణ తీసుకున్న ఇమాన్వి అన్ని భాషల్లోని హిట్ అయిన సినిమా పాటలకు డాన్సులు వేస్తూ లక్షల ఫాలోయర్స్ ను తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఈ అమ్మడికి ప్రభాస్ సినిమా చేయడానికి అవకాశం దక్కడంతో సోషల్ మీడియాలో ఈమె పైన క్రేజ్ మరింత పెరిగింది. ఒక్క రోజులోనే లక్షల ఫాలోయర్స్ ఆమెకు పెరగడం కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభాస్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్న ఇమాన్వి ఇస్మాయిల్ రొట్టె విరిగి నేతిలో పడిందని ఆమెపై పెద్ద చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+