పబ్లిక్‌లో అందరి ముందు అనసూయను ఆ పని చేసిన పోకిరి.. అంతా ఒక్కసారిగా షాక్
యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా తాను చేసిన ఓ పనితో ఆమె మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఆంటీ అని పిలిచాడు. బలయ్యాడు.!
— oneindiatelugu (@oneindiatelugu) March 16, 2025
హోలీ ఈవెంట్ లో అనసూయ హల్ చల్.! #Anasuaya #AnasuyaBharadwaj #Holi #HoliCelebration2025 #OITelugu pic.twitter.com/QQZWaztHHo
రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 40 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇదే సమయంలో అనసూయ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా అనసూయకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హోలీ సందర్భంగా ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్నారు అనసూయ. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈవెంట్ ఫుల్ జోష్‌గా సాగుతున్న సమయంలో ఓ పోకిరి ఆంటీ అంటూ సంబోంధించాడు. ఇది గమనించిన అనసూయ, దమ్ముంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడంటూ అతనికి సవాల్ విసిరింది. దీంతో బిత్తరపోయిన ఆ పోకిరి అక్కడ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేశాడు. ధైర్యం చాలడం లేదా, నీ ఫేస్ నాకు గుర్తింది, ఉచ్చ పడుతున్నాయా అంటూ చేతి వేళ్లతో సైగలు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అనసూయ ఇలా ప్రవర్తించడం ఇదేమి కొత్తేం కాదు. గతంలో కూడా తనని ఆంటీ అని పిలిచిన వారికి తనదైనశైలిలో వారికి కౌంటరిచ్చింది ఈ హాట్ బ్యూటీ.












Click it and Unblock the Notifications