పబ్లిక్ ప్లేస్‌లో మద్యం తాగిన ప్రభాస్
ప్రభాస్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. నార్త్ జనాలు సైతం ప్రభాస్ యాక్షన్‌కు ఫిదా అయిపోయారు. సాహో సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కవ కలెక్షన్స్ సాధించిందంటే అక్కడ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో నిరాశ పర్చిన ప్రభాస్, సలార్, కల్కి వంటి వరుస హిట్లతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా నిరూపించాడు. ప్రభాస్ ప్రస్తుతం సలార్-2, కల్కి-2 సినిమాల్లో నటిస్తున్నాడు.
#Prabhas as chain smoker, drunker and drug dealer
— 𝙳𝚛.𝚁𝚊𝚗𝚍𝚘𝚖 (@LuccyDevil) November 4, 2024
A Thread 🧵
RT/share for more visibility! pic.twitter.com/C1w4HWi7o3
దీంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సీగ్రల్ ఇచ్చాడు. ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి ఓ లుక్ వేస్తే.. ఆయన చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. బయట పెద్దగా కనిపించరు. తన సినిమా ఫంక్షన్స్‌లో మాట్లాడానికే ఆయన సిగ్గపడుతుంటారు. కేవలం తన స్నేహితులతోనే ప్రభాస్ ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రభాస్ మద్యం తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవి ఓ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటోలని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫొటోలు సినిమాలోనివి అనే కామెంట్స్ వస్తున్నాయి. ఓ చిత్రంలో ప్రభాస్ డ్రగ్ డీలార్ గా, చైన్ స్మోకర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో కూడా స్మోకింగ్ చేస్తారని పలువురు చెప్పడం జరిగింది. బాలకృష్ణ అన్‌స్టాప్‌బుల్ షోకు ప్రభాస్, గోపిచంద్ హాజరయ్యారు. ఆ సమయంలో గోపిచంద్ ప్రభాస్ సిగరేట్ తాగుతారని హింట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications