హత్య కేసులో సినీ దర్శకుడు అరెస్టు, నిజ జీవితం మొత్తం సినిమా స్క్రిప్ట్, కన్నింగ్
కర్ణాటకలోని చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసు మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ఈ కేసులో రెండో నిందితుడిగా శ్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్, హీరో దర్శన్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇదే హత్య కేసులో ఏ1 నిందితురాలిగా కన్నడ నటి పవిత్ర గౌడ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శిక్షణ అనుభవిస్తున్నది.
ఈ హత్య కేసుకు సంబంధించి మొత్తం 17 మంది నిందితులు ఇప్పుడు విచారణ ఖైదీలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. హీరో దర్శన్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంటే హీరో దర్శన్, నటి పవిత్ర గౌడతో పాటు హత్య కేసులో నిందితులకు ఇప్పుడే బెయిల్ రావడం కష్టంగా మారింది. ఈసారి మరో హత్య కేసులో శ్యాండిల్ వుడ్ కు చెందిన మరో సినీ దర్శకుడు అరెస్టు అయ్యాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన హత్యకేసులో కన్నడ సినీ దర్శకుడు అరెస్టు కావడంతో శ్యాండిల్ వుడ్ మరోసారి ఉలిక్కిపడింది.

20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తలదాచుకున్న ప్రముఖ దర్శకుడు గజా అలియాస్ గజేంద్రను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. 2004లో బెంగళూరులోని విల్సన్ గార్డెన్‌లో రౌడీషీటర్ రవిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో శ్యాండిల్ వుడ్ దర్శకుడు గజా అలియాస్ గజేంద్ర 8వ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో చంద్రప్ప, అల్యూమినియం బాబు తదితరులు ఉన్నారు. హత్య జరిగిన వెంటనే సినీ దర్శకుడు గజేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాదాపు ఏడాది పాటు జైలులో ఉన్న సినీ దర్శకుడు గజా తరువాత బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత గజా బెయిల్ నిబంధనలు పాటించకుండా, కోర్టుకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడు. 20 ఏళ్లుగా దర్శకుడు గజా ఎవరికీ చిక్కలేదు. పోలీసులు ఎంత వెతికినా ఆ పోలీసులకు చుక్కలు చూపించిన గజా తప్పించుకుని తిరుగుతున్నాడు.
అయితే టైమ్ బాగాలేకపోవడంతో గురువారం గజా బెంగళూరు పోలీసులకు చిక్కిపోయాడు గజాను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. పుటాని పవర్, రుద్ర తదితర కన్నడ చిత్రాలకు గజేంద్ర అలియాస్ గజా దర్శకత్వం వహించాడు. తమిళంలో రెండు సినిమాలకు గజా దర్శకత్వం వహించాడు. అయితే ఇంతకాలం దర్శకుడు గజా ఎక్కడ తలదాచుకున్నాడు. అతనికి ఎవరెవరు సహాయం చేశారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications