'పొలిమేర 3' లో బిగ్ ట్విస్ట్..స్టార్ హీరో ఎంట్రీ.. పూనకాలు లోడింగ్..!

తెలుగులో ఇప్పటివరకు చాలా హార్రర్ మూవీస్ వచ్చాయి. అయితే వాటిల్లో పొలిమేర, పొలిమేర 2 చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్ కు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు సత్యం రాజేశ్- విశ్వనాథ్ కాంబోలో పొలిమేర 3 తెరకెక్కుతోంది. ఈ సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ కు మూడో భాగం కూడా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

పొలిమేర 3 కు సంబంధించిన గ్లింప్స్ గతేడాది జులైలో విడుదల చేశారు. ఆ విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ బిగ్ ట్విస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పొలిమేర 3 లో కన్నడ స్టార్ ఉపేంద్ర ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దాంతో ఈ సినిమాకు ఒక్కసారిగా భారీ హైప్ వచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా పొలిమేర 3 కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ పొలిమేర 3 ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక పొలిమేర 3 కథను దేశవ్యాప్తంగా జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మూవీ కథను స్టార్ హీరో ఉపేంద్రకు వినిపించాడట. కథ నచ్చి ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఆంధ్రా కింగ్ తాలుకా చిత్రంలో ఉపేంద్ర నటించిన విషయం తెలిసిందే. అంతకుముందు రజనీకాంత్ కూలీ చిత్రంలోనూ ఉపేంద్ర కీలక పాత్రలో మెరిశారు. మరి పొలిమేర 3 లో ఉపేంద్ర పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Polimera3 movie Shocker star Upendra Bombshell Entry Poonakalu Loading Horror Meets Mass Magic

పొలిమేర 3 లో ఉపేంద్ర తో పాటుగా..సత్యం రాజేశ్​, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, పృథ్వీరాజ్, రాకెందు మౌలి తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. వంశీ నడిపాటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​ పై వంశీ, భోగేంద్ర గుప్త సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు గ్యానీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+