Pooja Hegde: ప్రభాస్ పై బుట్టబొమ్మ కామెంట్స్- రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!!

పూజా హెగ్డే... చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. క్యూట్ స్మైల్‌తో మెస్మరైజ్ చేసి అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో తాను నటించిన చిత్రాలు గతంలో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. ఇక హీరోయిన్లకు కాంపిటీషన్ పెరగడంతో పూజా హెగ్డేకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఇక అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్‌తో అక్కడక్కడ మెరుస్తోంది ఈ భామ. దీంతో పరభాష సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అక్కడ కూడా సినిమాలు పెద్దగా ఆడటం లేదు. యావరేజ్‌టాక్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా ఈ బుట్టబొమ్మ ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసి హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.

చాలా గ్యాప్ తర్వాత...
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎవరి అభిప్రాయాలను వారు సోషల్ మీడియా వేదికగా చాలా స్వేచ్ఛగా పంచుకుంటున్నారు. కొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటుంటే మరికొన్ని అభిప్రాయాలు వివాదాలకు తావిస్తున్నాయి. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు వైరల్ అయినా...దానిపై పెద్ద డిబేట్లే నడుస్తున్నాయి. ఇక సెలబ్రిటీలు,సినిమా స్టార్ల విషయానికొస్తే అంతే ఉండదు. వారు ఏ చిన్న పోస్టు చేసినా, లేదా ఏ చిన్నస్టేట్‌మెంట్ ఇచ్చినా వెంటనే వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే కూడా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజా హెగ్డే... అక్కడి యాంకర్ అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యే సమాధానం ఇచ్చింది. అది కూడా ప్రభాస్ పేరును తీసి ఈ సమాధానం చెప్పుకొచ్చింది ఈ జిగేలు రాణి.

pooja-hegde-interesting-comment-on-prabhas-social-media-goes-viral-online-how-will-the-rebel-star-r

పూజా హెగ్డే షాకింగ్ సమాధానం

ఇక అసలు విషయానికొస్తే..ఇంటర్వ్యూలో యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. తాను నటించిన నటులలో ఎవరు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారనేది ప్రశ్న. ఆవిడ అలా అడిగిందో లేదో.. తడుముకోకుండా వెంటనే ప్రభాస్ అని సమాధానం చెప్పేసింది పూజా హెగ్డే. ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదని కచ్చితంగా ప్రభాస్ అని చాలా క్లారిటీతో చెప్పింది. ప్రభాస్ అసలు సోషల్ మీడియానే వినియోగించడని.. తాను సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారని తన ప్రమోషన్స్‌కు సంబంధించి మొత్తం తన టీమ్ చూసుకుంటుందని పూజా హెగ్డే వివరించింది. అందుకే ప్రభాస్ సోషల్ మీడియా యూసేజ్‌లో అందరికంటే వెనుకబడి ఉంటాడని చెప్పింది. పూజా చెప్పిన సమాధానంతో యాంకర్ కూడా నోరెల్లబెట్టడం విశేషం.

పూజా హెగ్డేకు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్

పూజా హెగ్డే సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభాస్ అభిమానులు బుట్ట బొమ్మకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభాస్ గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నారంటూ కౌంటర్లిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవడంతో ప్రభాస్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేస్తున్నాడనే మరో వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉంది. అయితే ఇందులో వాస్తవం ఎంతుందో ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయడం లేదు. ఒక రకంగా చూస్తే ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివగా కనిపించరని మరికొందరు చెబుతున్నారు. పూజా హెగ్డే చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని ఆమెకు అండగా నిలుస్తున్నారు.

ఇదంతా అటుంచితే... రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక ఓటీటీలో కూడా రాజాసాబ్‌ చిత్రంపై విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా అడ్వర్టయిజ్‌మెంట్స్‌తో సినిమా చూడాలన్న ఆసక్తి తగ్గుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజా సాబ్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న ప్రభాస్ తిరిగి సెట్స్ పైకి వెళుతున్నారు. ఫౌజీ చిత్రంకు రెడీ అవుతుండగా... మరో వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం కూడా రానుంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌లో రెబల్ స్టార్ కనిపించనున్నారు. సందీప్ రెడ్డి డైరెక్షన్ అంటేనే అదో క్రేజ్.. మరి వీరిద్దరి కాంబోలో చిత్రం అంటే..అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీని తర్వాత పలు సీక్వెల్ చిత్రాలతో రెబల్ స్టార్ అలరించనున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+