ఆ హీరోతో పెళ్లికి రెడీ అయిన పూజా హెగ్దే ..?
ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.
వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.

తాజాగా పూజా హెగ్దేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూజా హెగ్దే త్వరలోనే పెళ్లీ పీటలెక్కబోతుందని తెలుస్తోంది.పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు త్వరలోనే ఆ వ్యక్తిని పెళ్లాడబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రా తో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ రోహన్ తో తరచుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. పలుమార్లు కెమెరాకు చిక్కింది పూజా హెగ్డే.
అతనితో కలిసి పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తుంది.పూజా హెగ్డే ఎక్కడికి వెళ్లినా ఆమె పక్కనే రోహన్ మెహ్రా ఉండటం గమనార్హం.ఆ మధ్య పూజాగా హెగ్డే కారులో వెళ్తుండగా ఆమెతో పాటు రోహన్ మెహ్రా కూడా దర్శనం ఇచ్చాడు. దీంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. దీంతో పూజా పేరెంట్స్ కూడా కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని , త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications