వరుసగా 7 ఫ్లాప్‌లు..ఈ హీరోయిన్ ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా ఫ్లాపే
టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చ ఏసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలామంది నటులు, నటీమణులు టాలెంట్ ఉన్నా అదృష్టం లేక ఫేడ్ అవుట్ అయ్యారు. ఇక సినిమా ఇండస్ట్రీలో హిట్ అయినప్పుడు పొగడ్తలు, ఫ్లాప్ అయినప్పుడు విమర్శలు కామన్. సినిమా హిట్ అయితే ప్రశంసలు కురిపించిన వారే , ఒక్క ఫ్లాప్ పడితే ఐరన్ లెగ్ ముద్ర వేస్తారు.
సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉంది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ మరెవరో కాదు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఒక్కప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్‌తో రాధే శ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్‌తో అల వైకుంఠపురం సినిమాల్లో నటించి మెప్పించింది.

తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్లు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనుహ్యంగా కనుమరుగైంది.వరుస ప్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుకపడిపోయింది. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్ని కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది.
పైగా గురుజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. తాజాగా అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఎన్నో అంచనాలతో దక్షిణాదిలో సూపర్ డూపర్ హిట్టు కొట్టాలని రెట్రోలో డీ గ్లామర్ రోల్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.ఈ సినిమా కూడా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈ బ్యూటీ వెనుక వరుసగా 7 ఫ్లాప్ సినిమాలు చేరాయి. పూజా హెగ్డే ఏ సినిమా చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. దీంతో ఆమెతో సినిమా చేయాలంటే స్టార్ హీరోలు హడలిపోతున్నారు.












Click it and Unblock the Notifications