పూనమ్ కౌర్ వర్సెస్ త్రివిక్రమ్.. మళ్లీ మొదలైన రచ్చ! ఈ వివాదానికి ముగింపు లేదా?

ప్రముఖ నటి పూనమ్ కౌర్ టాలీవుడ్ స్టార్ దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను ఉద్దేశించి మరోసారి పరోక్షంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన బహిరంగ సమాజంలో చూపే ప్రతిష్టకు, నిజజీవితంలో చేసే పనులకు మధ్య ఉన్న తేడాను ప్రశ్నస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను ఫేక్ గురూజీ అని సంబోధిస్తూ.. ఆయన ప్రవర్తనను ప్రశ్నించినందుకే తన సినీ కెరీర్ నాశనమైందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ హిట్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..!

తన ఇన్‪‌స్టాగ్రామ్ స్టోరీలో పూనమ్ కౌర్ స్పందిస్తూ.. "నీ వేధింపులను ప్రశ్నించినందుకే నా కెరీర్‌ను అంతం చేశావు. దేవుడు నీకు ఏం చూశాడో చూసుకో. కాస్తైనా సిగ్గుపడాలి. నువ్వు వేదికలపై గొప్ప నీతులు చెప్పవచ్చు, కానీ నేను వాటిని నా జీవితంలో ఆచరిస్తాను" అని పూనమ్ కౌర్ రాసుకొచ్చారు. పూనమ్ కౌర్ చేసిన ఈ కామెంట్స్ కేవలం ఓ వ్యక్తిగత విమర్శతో ఆగకుండా.. త్రివిక్రమ్ బయట చెప్పే విలువలను నేరుగా ప్రశ్నించేలా ఉన్నాయి. ఆయన ప్రవర్తనను నిలదీసినందుకే తన అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఆరోపిస్తున్నప్పటికీ.. ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేదా అధికారిక ధ్రువీకరణలు లేవు.

Poonam Kaur vs Trivikram Fresh Controversy Erupts Over Fake Guruji Remarks She Questioning his Behavior

మరోవైపు ఈ వ్యవహారంపై ఓ నెటిజన్ ఘాటుగా స్పందిస్తూ.. ఇలాంటి కామెంట్స్ వల్ల త్రివిక్రమ్ కెరీర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భిన్నమైన అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నాయి. ఒక వైపు పూనమ్ కౌర్ తన కెరీర్ దెబ్బతిందని ఆరోపిస్తుండగా.. త్రివిక్రమ్ మాత్రం తెలుగు చిత్రసీమలో తన ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.

మరో బిగ్ మల్టీస్టారర్‌.. ఇద్దరు స్టార్ హీరోలతో మణిరత్నం బిగ్ సర్‌ప్రైజ్!
మరో బిగ్ మల్టీస్టారర్‌.. ఇద్దరు స్టార్ హీరోలతో మణిరత్నం బిగ్ సర్‌ప్రైజ్!

పూనమ్ కౌర్ గత కొన్నేళ్లుగా త్రివిక్రమ్‌పై ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉన్నప్పటికీ.. ఈ వివాదంపై ఆయన నుంచి ఇంతవరకు ఎలాంటి వివరణ రాకపోవడం గమనార్హం. ఆమె వరుస పోస్టులతో చర్చను రేపుతున్నప్పటికీ.. ఈ వివాదానికి మాత్రం ఎలాంటి ముగింపు లభించడం లేదు. త్రివిక్రమ్ తన సినిమాలతో ముందుకు సాగుతుంటే పూనమ్ కౌర్ మాత్రం తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆయన మౌనం వహించడమే ఈ వివాదం ఇంకా సజీవంగా ఉండటానికి ప్రధాన కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+