సెల్ఫీ కోసం వచ్చి హీరోయిన్ ను ముద్దు పెట్టుకున్నాడు.. పబ్లిక్ లో మీద చేయి వేసి..
సెలబ్రిటీలు బయటకు వెళ్తే సెల్పీలు అని ఫోటోస్ అని ఫ్యాన్స్ ఎగబడతారు. చాలా మంది సెలబ్రిటీస్ కు ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటుంది. అలాంటి చేదు అనుభవమే బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు ఎదురైంది. సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి ఆమెకు ముద్దుపెట్టబోయాడు. దీంతో షాక్కు గురైన పూనమ్ అతడిని పక్కకు నెట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సెల్ఫీ అని వచ్చి..
పూనమ్ పాండే ఇటీవల ముంబయి నగర వీధుల్లో సందడిగా తిరిగారు. ఈ సమయంలో ఓ అభిమాని సెల్ఫీ కోసం పూనమ్ దగ్గరికి వచ్చాడు. పూనమ్ సెల్ఫీకి అంగీకరించారు. అయితే ఫొటో తీసుకుంటున్న క్రమంలో సదరు అభిమాని ఆమెకు ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు.అభిమాని చర్యలకు పూనమ్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమెతోపాటు.. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు వెంటనే ఆతడిని పక్కకు నెట్టేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
వీడియో చూసిన నెటిజెన్లు సదరు వ్యక్తిపై ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ లో ఆమెతో అలా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. ఇవేం పిచ్చి పనులు అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications