పవర్ స్టార్ భార్యకు అవమానం, దానికి దీనికి ఏమైనా సంబందం ఉందా ?, ఆర్ సీబీతో లింక్ పెట్టి !
సినిమా హీరో అభిమానుల పైత్యం తారాస్థాయికి చేరింది. శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినిని చులకన చేస్తూ సోషల్ మీడియాలో ఆమెను తీవ్రస్థాయిలో విమర్శించడంతో అప్పు అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ప్రారంభించి పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పునీత్‌రాజ్‌కుమార్‌ను తీవ్రస్థాయిలో అవమానించారు.
అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ ను అవమానించారంటూ అప్పు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్ లో ఆర్ సీబీ ఓటమికి అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ కారణమని దర్శన్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఆమెను అవమానిస్తున్నారని పునీత్ రాజ్ కుమార్ అభిమానులు బెంగళూరు నగర పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఆర్ సీబీ ఓటమికి అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ కారణమంటూ గజపడే అనే ఫేస్ బుక్ పేజీని రూపొందించారు.

ముత్తైదువులను పిలుచుకుని వెళితే శుభం కలుగుతుందని, భర్త చనిపోయిన విదవలను పిలుచుకుని వెలితే అంతా అశుభం ఎదురౌతుందని కొందరు సోషల్ మీడియాలో పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ ను అవమానించేలా పోస్టులు పెడుతున్నారు. భర్త లేని వారిని పేరంటానికి పిలిచారని, అదే ఆర్ సీబీ ఓటమికి కారణం అని ఆ ఫేస్ బుక్ పేజీలో రాశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారం రేపింది.
ఈ పోస్టులు చూసి పవర్ స్టార్ అప్పు అభిమానులు మండిపడుతున్నారు. కన్నడ నటుడు పునీత్‌రాజ్‌కుమార్ చనిపోయిన తరువాత కూడా ఇలాంటి అవమానాలు సర్వసాధారణంగా జరుగుతున్నాయని, ఇలాంటి వాటికి పూర్తిగా స్వస్తి చెప్పాలని అప్పు ఫ్యాన్స్ శ్యాండిల్ వుడ్ హీరో దర్శన్ అభిమానులుగా చెప్పుకుంటునన వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఆర్ సీబీ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అశ్విని పునీత్ రాజ్‌కుమార్ కనిపించారు.

అప్పుడు అశ్విని బెంగుళూరు'ని తొలగించి కొత్త పాస్‌వర్డ్‌ను సెట్ చేస్తారు. తర్వాత కెమెరా వైపు తిరిగి, అర్థమైందా?' అని అడుగుతాడు. ఇంత కాలం RCB పేరు 'రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు'. కానీ ఈసారి దానిని మార్చి 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు' (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)గా రూపొందిస్తున్నారు. మార్చి 15వ తేదీన ప్రారంభమైన RCB అన్‌బాక్సింగ్ ఈవెంట్‌కి సంబంధించిన ప్రచార ప్రకటన ఇది. దీనిపై కొందరు వ్యక్తులు అశ్విని పునీత్ రాజ్ కుమార్ ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అభిమానులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications