అద్భుతమైన బ్లాక్ బస్టర్ ను వదులుకున్న పవన్ కల్యాణ్
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని రూపొందించుకోవడమేకాదు.. అభిమాన గణాన్ని కూడా సంపాదించుకున్నారు. అతి త్వరలోనే స్టార్ హీరోగా మారిపోయి పవర్ స్టార్ అయ్యారు. అక్కడ అమ్మాయి.. సినిమా నుంచి ఖుషి వరకు అన్నీ హిట్లే ఇచ్చినప్పటికీ తర్వాత నెమ్మదించాడు. చేసే ప్రతి సినిమాను ఆచితూచి ఎంచుకునే పవర్ స్టార్ ఒక సినిమా విషయంలో మాత్రం పొరపాటు చేశారు. తన పక్కన ఉన్న ఒక వ్యక్తి మాటలు విని ఆ సినిమాను వదులుకున్నాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. డాలర్ డ్రీమ్స్ తర్వాత శేఖర్ తీసిన సినిమా ఇది. అయితే డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ముందుగా ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఐదు కేంద్రాల్లో విడుదలై ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. రాజా హీరోగా నటించగా, కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఈ కథను శేఖర్ కమ్ముల ముందుగా పవన్ కల్యాణ్ కు వినిపించాడు. పవన్ కు ఈ కథ బాగా నచ్చింది. చేద్దామని నిర్ణయించుకోగా.. మొదటి నుంచి పవన్ కల్యాణ్ పక్కన ఉండే ఓ వ్యక్తి చెప్పిన మాటలతో ఆ సినిమాను వదులుకున్నాడు.

ఆ వ్యక్తి.. బాబూ మీరు ఈ సినిమా చేస్తే కేవలం క్లాస్ హీరోనే అవుతారు.. మాస్ హీరోగా రాణించలేరు.. మీరు మాస్ సినిమాలే చేయాలి అంటూ చెప్పడంతో ఊగిసలాటలో ఉన్న పవన్ ఆ సినిమాను వదులుకున్నారు. పవన్ ఈ సినిమా చేసుంటే కచ్చితంగా సూపర్ హిట్ అతని ఖాతాలో పడేదని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీతో ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడు. తెలుగుదేశం, బీజేపీతో పొత్తు పెట్టుకొని కచ్చితంగా అసెంబ్లీలో, లోక్ సభలో జనసేనకు ప్రాతినిధ్యం ఉండాలనే పట్టుదలతో ఉన్న పవన్ అందుకనుగుణంగా వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications