'ఓజీ' లో పవన్ కల్యాణ్ కారు నెంబర్ కు ఇంత చరిత్ర ఉందా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజిత్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఓజీ. ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డీవీవీ దానయ్య బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ నిర్మించారు. ఇందులో పవన్ ఓజాస్ గంభీర పాత్రలో నటిస్తున్నారు. తాజాగా సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గ్లింప్స్ తో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. చేతిలో కత్తితో శ్వాగ్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఇది సినిమాపై హైప్ పెంచుతోంది.
అయితే ఇటీవల పవన్ కల్యాణ్ కారుపై కూర్చొన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. కారు క్రింద రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఒక భారీ ఫైట్ తర్వాత పవన్ కళ్యాణ్ రిలాక్స్ అవుతూ కారు మీద కూర్చున్న షాట్ లాగా అనిపిస్తుందంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాక ఆయన కూర్చున్న కారు నెంబర్ ను కూడా చేస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చిన వివరణ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

ఆ కారు నెంబర్ 0893. 08 అంటే ఆగస్టు నెల, 93 అంటే 1993. ఇది పవన్ కల్యాణ్ తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయిలో నటించడానికి సంతకం చేసిన రోజు అంటూ చెప్పుకొచ్చారు ఫ్యాన్స్. డైరెక్టర్ సుజిత్ కు అది తెలుసు కాబట్టే, ఇలా పెట్టాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా నటించారు. మరో 23 రోజుల్లో విడుదల కానున్న క్రమంలో ఓవర్సీస్లో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.












Click it and Unblock the Notifications