ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ప్రభాస్... ఏ సినిమానో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 చేస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్ హీరో కాగా, తారక్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా షూటింగ్ పూర్తయితే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడం ఖాయమైంది. సితార్ బ్యానరులో ఇది రాబోతోంది. ఇటీవలే తారక్ నటించిన దేవర సినిమా రూ.550 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. మిక్స్ డ్ టాక్ తోనే ఈ కలెక్షన్లు రాబట్టడం అనేది తారక్ మాస్ ఇమేజ్ వల్లే సాధ్యమైందని విశ్లేషకులు అంటారు.

చాలామందికి ఈ విషయం తెలియదు
పాన్ ఇండియా డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ప్రభాస్ లైనప్ చాలా బాగుందని సినీప్రియులంతా మెచ్చుకుంటున్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఆరునెలలకు ఒక సినిమా విడుదలయ్యేలా ప్రణాళిక రచించుకుంటున్నాడు. స్పిరిట్, సలార్ 2 చేయాల్సి ఉంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. అయితే అంతకుముందే డార్లింగ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారనే విషయం చాలామందికి తెలియదు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా పేరు యమదొంగ.

Prabhas guest role in junior NTR movie Do you know which movie

పేర్లు పడే సమయంలో కనపడతాడు
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన పేర్లు పడే సమయంలో చిన్న పాత్రలో మెరుస్తారు. అలా కనపడి ఇలా మాయమవుతారు. విశ్వామిత్ర ప్రొడక్షన్స్ కోసం టెస్ట్ షూట్ జరిగితే అందులో ముని గెటప్ లో కనిపిస్తారు. చాలామంది ప్రభాస్ ను కనిపెట్టలేరు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాలో మరో పాన్ ఇండియా స్టార్ అతిథి పాత్రలో కనిపించడం అంటే సాధారణ విషయం కాదని, అది డార్లింగ్ మంచి మనసుకు నిదర్శనమని నెటిజన్లు కొనియాడుతున్నారు. రాజమౌళి దర్శకుడు కాబట్టి ఒప్పుకున్నాడని కొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ చాలా సంవత్సరాల తర్వాత ఈ విషయం బయటకు రావడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+