న్యూమరాలజీ ప్రకారం పేరుమార్చుకున్న ప్రభాస్?

పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ నుంచి సంక్రాంతి కానుకగా అభిమానుల కోసం రాజా సాబ్ చిత్రం టైటిల్ తో ఒక పోస్టర్ విడుదల చేశారు. తాజాగా ఈ పోస్టర్ కు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ప్రభాస్ పేరును ఇంగ్లిషులో ఒక ఎస్ అక్షరం ఎక్కువగా ఉపయోగించారు. prabhas పేరుకు బదులుగా prabhass అని వాడారు. దీంతో చిత్ర యూనిట్ ఈ విషయంలో తప్పు చేసిందా? లేదంటే న్యూమరాలజీ ప్రకారం ప్రభాస్ అలా మార్చుకున్నాడా? అనే చర్చ సాగుతోంది.

చిరంజీవిది భోళాశంకర్ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన సమయంలో కూడా అదనంగా ఒక అక్షరాన్ని జతచేశారు. అప్పుడు కూడా న్యూమరాలజీ ప్రకారం చిరంజీవి పేరు మార్చుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే దాన్ని చిరంజీవి టీం ఖండించింది. అలాగే అక్షరం ఒకటే కాకుండా ప్రభాస్ లుక్ పై కూడా చర్చ నడుస్తోంది. బయట ప్రభాస్ వేరుగా ఉంటాడని, రాజా సాబ్ పోస్టర్ లో చూపించిన ఫొటో మాత్రం ఒరిజినల్ కాదేమో అనే సందేహంవ్యక్తమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ ద్వారా చేసిన చిత్రం కావచ్చంటున్నారు.

Prabhas Name changed According to Numerology?

రూ.వెయ్యి కోట్లు సాధిస్తుందనుకున్న సలార్ చిత్రం రూ.650 కోట్ల దగ్గర ఆగిపోవడంతోపాటు వరుసగా మూడు చిత్రాలు కూడా ఫ్లాపవడంతో న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చివుంటారనే అభిప్రాయాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి, మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రాలను ప్రభాస్ చేస్తున్నారు. ఈ ఏడాది మే 9న ప్రపంచ వ్యాప్తంగా కల్కిని భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పడుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+