పఠాన్, జవాన్, యానిమల్ సినిమాల రికార్డులను బద్దలుగొట్టిన ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్!!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర నటుడు ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, బాబి సింహ, టిను ఆనంద్, ఈశ్వరి రావ్, శ్రీయ రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్స్ ఆఫీసులను దున్నేస్తుంది.
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా బాలీవుడ్ యాక్టర్స్ షారుక్ ఖాన్, రణబీర్ కపూర్ సినిమాల రికార్డులను పక్కకునెట్టి టాప్ లో నిలిచింది. ఇండియాలో తొలిరోజు కలెక్షన్లలో రికార్డుల మోత మోగించిన సలార్ సినిమా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలతోపాటు, రణ్ బీర్ కపూర్ యానిమల్ సినిమా రికార్డులను కూడా బద్దలు కొట్టి, 95కోట్ల ఓపెనింగ్ వసూళ్ళు సాధించింది.

వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజే దుమ్మురేపింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఏకంగా 70 కోట్ల రూపాయల వసూలు చేసింది ఈ సినిమా. కర్ణాటక, కేరళ లో వరుసగా 12 కోట్లు, 5 కోట్లు వసూలు చేసింది.
పఠాన్ సినిమా తొలిరోజు 57 కోట్లు సాధించగా, జవాన్ 75 కోట్లు, సినిమా 63 కోట్ల రూపాయలు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డులన్నింటినీ సలార్ అధిగమించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇందులో ప్రభాస్ వన్ మ్యాన్ షోతో ఇరగదీసాడని ప్రేక్షకుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో, భారీ కలెక్షన్లు రాబడుతూ ఉండటంతో చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటుంది.
ఇదిలా ఉంటే సలార్ సీజ్ ఫైర్ మూవీకి సీడెడ్ ఏరియాలో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. సీడెడ్ ఏరియాలో మొదటి రోజు ఏకంగా 6.45కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. సీడెడ్ లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రభాస్ సినిమాగా సలార్ సీజ్ ఫైర్ రికార్డు సృష్టించింది. సీడెడ్ లో బాహుబలి- 2, 6.35కోట్ల రికార్డును, ప్రభాస్ లేటెస్ట్ సినిమా సలార్ సీజ్ ఫైర్ బీట్ చేసింది.












Click it and Unblock the Notifications