'సలార్' కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన హోంబలే ఫిలింస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులే కుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. డిసెంబరు 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఒంటినిండా నెత్తురుతో తడిసిపోయివున్న ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

షారుక్ తో పోరు : అదేరోజు షారుక్ ఖాన్ హీరోగా నటించిన డుంకీ చిత్రం విడుదల కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు హోరాహోరీగా ఢీకొంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 28వ తేదీనే సలార్ విడుదల కావాల్సి ఉన్నప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని సన్నివేశాల దగ్గర రాజీ పడకపోవడంతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ చిత్రాన్ని వాయిదా వేసింది.

Prabhas Salaar Movie new release date

భారీ ధరకు ఓటీటీ రైట్స్ : తాజాగా ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుబోయినట్లు తెలుస్తోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు పలికినట్లు తెలుస్తోంది. రూ.350 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్‌ను స్టార్ నెట్‌వర్క్, ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. విడుదలకు ముందే రికార్డుస్థాయి వసూళ్లు రాబట్టడంతో సలార్ మూవీపై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బాహుబలి తరువాత బ్లాక్‌బస్టర్ హిట్ లేని లోటు సలార్ తో తీరుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

1980 బ్యాక్ డ్రాప్ లో : ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. సలార్ ను రెండు పార్టులుగా తీసుకువస్తున్నారు. సలార్ చీజ్‌ఫైర్-1 అంటూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది రానున్న భారీ చిత్రాలలో సలార్ ఒకటి. 1980 బ్యాక్ డ్రాప్‌ లో మూవీ కథ సాగింది. సున్నపు రాయి మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని, ప్రభాస్ క్యారెక్టర్ ను ఓ రేంజ్‌లో చూపించినట్లు ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+