ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న...జపాన్ అభిమానులు..
బహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యూనివర్సల్ హీరోగా మారిపోయాడు. అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా మారిన ప్రభాస్ పుట్టినరోజు. ప్రభాస్ అభిమానులకు ముందే దసరా పండుగ వచ్చేసింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించే పనిలో ఉన్నారు అభిమానులు. ఈక్రమంలోనే ప్రభాస్ సూపర్ హిట్ మూవీ 'ఛత్రపతి'ని రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ప్రభాస్‌కి ప్రపంచమంతా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జపాన్‌లో ఉన్న ప్రభాస్ అభిమానులు కూడా ఈ పుట్టినరోజును ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గదినంతా ప్రభాస్ ఫొటోలతో నింపేశారు..
ప్రభాస్ కోసం జపాన్ నుంచి హైదరాబాద్ కు చాలా సార్లు చాలా మంది జపాన్ అభిమానులు ప్రత్యేకంగా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. బహుబలి సినిమాతో ప్రభాస్‌కు జపాన్‌లో కూడా ఓ క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ప్రభాస్ బర్త్ డే రావడంతో ఆ సందర్భాన్ని ఒక వేడుకలా చేస్తున్నారు బహుబలి అభిమానులు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటిలాగే బ్యానర్స్, సేవ కార్యక్రమాలు, కేక్ కటింగ్స్ తో కొన్ని కార్యక్రమాలను ప్లాన్ చేశారు ఆయన అభిమానులు.

ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ భారీ కటౌట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా జపాన్‌లో ఉన్న ఆయన ఫ్యాన్స్ ఒక గదినంతా ప్రభాస్ ఫొటోలతో నింపేశారు. ఇక ఆ ఫోటోలకు పూలదండలు వేసి, ప్రసాదాలు పెట్టి ఒక పండగ వాతావరణాన్ని అక్కడ సృష్టించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రభాస్ మీద వారికున్న అభిమానంతో అక్కడ ఉన్న కొన్ని వస్తువలను, ప్రభాస్ బ్రాండ్ తో మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫ్యాషన్ ను కూడా జపాన్ అభిమానులు బాగా ఫాలో అవుతుంటారు.

ప్రభాస్ నటించిన సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న టీజర్ తప్ప ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ బర్త్ డేకి అయినా ఏమన్నా అప్డేట్ వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ అభిమానులు..












Click it and Unblock the Notifications