ఎవరీ ప్రదీప్ రంగనాథన్..? మొన్న Love Today.. నేడు Dragon..
ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ని కదిపినా ఈయన పేరే వినిపిస్తోంది. కేవలం రెండు సినిమాలతోనే తమిళనాట సెన్సేషనల్ స్టార్ అయ్యాడు. అంతేకాక మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లను ఆకర్షించాడు ప్రదీప్ రంగనాథన్.
ఇప్పుడు తమిళ్ లో ఇతగాడి క్రేజ్ మామూలుగా లేదు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్.. డ్రాగన్ సినిమా చూసి ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించారంటే ఆయన క్రేజ్ ఏంటో అర్థమైపోతోంది. అసలు ఎవరీ ప్రదీప్ రంగనాథన్..? బీటెక్ నుంచి దర్శకుడిగా ఎలా మారాడు..?

షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ..
ప్రదీప్ రంగనాథన్ జులై 25, 1993లో చెన్నైలో జన్మించాడు. బీటెక్ చేస్తున్న రోజుల్లోనే ప్రదీప్ కథలు రాయడం ప్రారంభించాడు. అలా సొంతంగా రాసుకున్న కథలను షార్ట్ ఫిల్మ్స్ గా తీయడం స్టార్ట్ చేశాడు. 2014లో వాట్సాప్ కాథల్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలా వరుసబెట్టి షార్ట్ ఫిల్మ్స్ తీయడం.. వాటిని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ఛానెల్ కు 7 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
కోమాలి చిత్రంతో..
ప్రదీప్ రంగనాథన్ డైరెక్షన్ లో వచ్చిన తొలి చిత్రం కోమాలి. జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దళపతి విజయ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇక యువతకు కనెక్ట్ అయ్యేలా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు ప్రదీప్ రంగనాథన్. ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో తానే హీరోగా నటించి.. దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.
డ్రాగన్ బ్లాక్ బస్టర్..
ప్రదీప్ రంగనాథన్, అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'డ్రాగన్' ఫిబ్రవరి 21 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ డైరెక్షన్ వహిస్తున్నాడు.












Click it and Unblock the Notifications