తల్లి కాబోతున్న రామ్ చరణ్ హీరోయిన్..?
హీరోయిన్లు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తమ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన ప్రాధాన్యతను ఇస్తున్నారు. పెళ్లైన హీరోయిన్లు సైతం కెరీర్‌తో పాటు వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తున్న విధానానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. కొంతమంది హీరోయిన్లు తల్లైన తరువాత కూడా నటిస్తున్నారంటే వారి క్రేజ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బాలీవుడ్ హీరోయిన్ అలియ భట్ పెళ్లైన వెంటనే గర్భవతి అయింది. బిడ్డను కన్న తరువాత కూడా అలియా భట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. తాజాగా మరో స్టార్ హీరోయిన్‌గా గర్భవతి అయిందని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు కియారా అద్వానీ. అవును కియారా అద్వానీ తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాను కియారా గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా తల్లి కాబోతుందనే వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రుమార్స్‌ను కియారా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. దీంతో ఇదింతా అసత్య ప్రచారమే అని చెబుతున్నారు.
దీనిపై కియారా అద్వానీ దంపతులు ఇప్పటి వరకూ స్పందించకపోవడంతో ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇక కియారా అద్వానీ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాల్లో కనిపించిన కియారా..తరువాత బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది.












Click it and Unblock the Notifications