హైప్‌తో చంపేసేలా ఉన్నారే..!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అడ్వెంచర్ సినిమా గురించి అభిమానులు ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినిమా అంచనాలను ప్రపంచ స్థాయికి పెంచేస్తూ, రాజమౌళి తన కొత్త సినిమా నుండి ఓ సంచలనమైన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్ ద్వారా సినిమాలో హీరోయిన్ పాత్రను రాజమౌళి పరిచయం చేశారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా . పోస్టర్లో ప్రియాంకను చూసిన అభిమానులు అవాక్కయ్యారు.

పోస్టర్‌లో ప్రియాంక పూర్తిగా భారతీయత ఉట్టిపడే పసుపు రంగు చీరను కట్టుకుని, పట్టుకుని ఎగురుతున్నట్టుగా కనిపిస్తోంది. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నప్పటికీ, ఆమె చేతిలో ఒక పవర్ఫుల్ గన్ ఉండటం.. ఈ పాత్ర ఎంత వైల్డ్‌గా ఉండబోతుందో సూచిస్తోంది. సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రియాంక ఈ చిత్రంలో 'మందాకిని' అనే సాహసోపేతమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
పోస్టర్‌ను విడుదల చేస్తూ రాజమౌళి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో "Welcome back, Desi Girl!" అని ట్వీట్ చేయడంతో.. ప్రియాంక చోప్రా తిరిగి టాలీవుడ్‌కు గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్న విషయం ఖరారైంది. మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రాను తెరపై చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారి, సినిమా అంచనాలను మరింత పెంచింది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications