Priyanka Chopra:పైరేట్ థీమ్‌ డ్రెస్‌లో మహేష్ బాబు హీరోయిన్-ధర తెలిస్తే షాకే..!!

Priyanka Chopra: గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ కెమెరా కళ్లు ఆమెవైపే తిరుగుతాయి. అది రెడ్ కార్పెట్ అయినా లేదా సినిమా ప్రమోషన్స్ అయినా,తన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రపంచాన్ని ఫిదా చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం తన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' (The Bluff) ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ 'దేశీ గర్ల్'.. తన గ్లామరస్ అండ్ పవర్ ఫుల్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ ప్రమోషన్స్ కోసం ఆమె ఎంచుకున్న 'పైరేట్' థీమ్ అవుట్‌ఫిట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

పర్షియన్ ఫ్యాషన్.. పైరేట్ స్టైల్

'ది బ్లఫ్' చిత్రంలో ప్రియాంక ఒక మాజీ పైరేట్ (సముద్రపు దొంగ) 'ఎర్సెల్' పాత్రలో కనిపిస్తోంది.తన పాత్రలోని తీక్షణతను,గాంభీర్యాన్ని ప్రతిబింబించేలా రెండవ రోజు ప్రమోషన్లలో ఒక అద్భుతమైన సిల్క్ ఎన్సెంబుల్‌లో మెరిసిపోయింది.పర్షియన్ ఫ్యాషన్ స్ఫూర్తితో డిజైన్ చేసిన ఈ బ్యాక్‌లెస్ సిల్క్ డ్రెస్ ప్రియాంక అందాన్ని రెట్టింపు చేసింది.వైన్ కలర్ సిల్క్-శాటిన్ టాప్,హాల్టర్ నెక్ డిజైన్‌తో కూడిన ఈ డ్రెస్ ఆమె లుక్‌కు ఒక డ్రామాటిక్ టచ్ ఇచ్చింది.

priyanka-chopra-dominates-the-bluff-promotions-backless-silk-bold-pirate-vibes-rs2-6-lakh-fashion

రూ. 2.21 లక్షల రాజసం..

ప్రియాంక ధరించిన ఈ కాస్ట్లీ డ్రెస్ ప్రముఖ ఫ్యాషన్ హౌస్ 'జిమ్మెర్‌మాన్'(Zimmermann) డిజైన్ చేసింది. ఈ డ్రెస్కు సంబంధించి దాని ధరల గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • టాప్: హాల్టర్ నెక్ సిల్క్ టాప్ ధర సుమారు రూ. 77,700.
  • హారమ్ ప్యాంట్స్: శాటిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఈ ప్యాంట్స్ ధర రూ. 1,43,300.
  • మొత్తంగా ఈ అవుట్‌ఫిట్ ధర అక్షరాలా రూ. 2,21,000.
  • ఇక ఆమె ధరించిన 'కసాడై' బ్రాండ్ సమురాయ్ బ్లేడ్ పంప్ షూస్ ధర సుమారు రూ. 42,418. అంటే కేవలం ఒక రోజు ప్రమోషన్ కోసమే ప్రియాంక దాదాపు రూ. 2.6 లక్షలకు పైగా ఖర్చు చేసిందన్నమాట.

మేకప్ అండ్ జ్యువెలరీ.. ఓ రేంజ్ లో..

ఈ లుక్‌ను మరింత ఎలివేట్ చేయడానికి ప్రియాంక తన జుట్టును పలు రకాల జడలుగా అల్లి, ఒక జడను కిరీటంలా తల చుట్టూ చుట్టుకుంది. ముఖానికి బ్రౌన్ అండ్ న్యూడ్ పింక్ టోన్ మేకప్‌తో స్కల్ప్టెడ్ లుక్ ఇచ్చింది.తన నాభి (Naval) పియరింగ్ కనిపించేలా రూపొందించిన ప్యాంట్స్,భారీ గోల్డెన్ జ్యువెలరీ, బీడెడ్ స్ట్రింగ్స్ ఉన్న బ్లాక్ హ్యాట్ ఆమెను నిజంగానే సముద్రపు రాణిలా మార్చేశాయి.

ఇక ప్రియాంకా చోప్రా చిత్రం విషయానికొస్తే... యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో తెరకెక్కిన 'ది బ్లఫ్' చిత్రం ఫిబ్రవరి 25, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వెండితెరపై ప్రియాంక తన కత్తితో చేసే విన్యాసాలు చూడకముందే, తన ఫ్యాషన్ విన్యాసాలతో అభిమానులను క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ప్రియాంక క్రియేట్ చేసిన ఈ సరికొత్త పైరేట్ ట్రెండ్ ఇంకెంతమందిని మాయ చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+