ప్రియాంక చోప్రా తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ఇదే.. రామ్ చరణ్‌తో కాదు !

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హాలీవుడ్ లో సైతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను సంపాదించిన ఈమె ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా "మందాకిని" అనే ప్రధాన పాత్రలో కనిపించబోతుండగా.. నేడు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా మూవీ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ssmb 29 పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుండగా ఎటువంటి అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా సినిమాని పట్టాలెక్కించారు. టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ గా.. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా.. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

priyanka-chopra-first-telugu-cinema-apurupam-details

మరోవైపు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు కూడా అద్భుతంగా సాగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు లుక్ రివీల్, సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్, మూడు నిమిషాల అద్భుత విజువల్ ప్రెజెంటేషన్ తో పాటు స్పీచ్ లు ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయి. ఈ తరుణంలోనే ప్రియాంక చోప్రాకి సంబంధించిన మరో విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఫిల్మ్ కెరీర్..

2000లో మిస్ వరల్డ్ కిరీటం ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిందీలో "అందాజ్", "డాన్", "క్రిష్", "బర్ఫీ", "ఫ్యాషన్", "బాజీరావ్ మస్తానీ" వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా "ఫ్యాషన్" చిత్రంతో ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోగా.. దేశవ్యాప్తంగా ఆమెకు విశేష గుర్తింపు తీసుకొచ్చింది. అంతే కాకుండా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

అమెరికన్ టీవీ సిరీస్ "క్వాంటికో"లో ప్రధాన పాత్ర పోషించి గుర్తింపు పొందారు. ఆ తర్వాత "బేవాచ్", "ఇజ్ నిట్ ఇట్ రొమాంటిక్", "టెక్స్ట్ ఫర్ యూ", "సిటాడెల్" వంటి ప్రాజెక్టులతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అయితే ప్రియాంక చోప్రా తెలుగులో ఇప్పటివరకు నటించకపోయినా.. టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం సుపరిచితురాలే. రామ్ చరణ్‌తో కలిసి ఆమె బాలీవుడ్ చిత్రం "జంజీర్"లో నటించారు. ఈ చిత్రం రామ్ చరణ్‌కు హిందీ డెబ్యూట్ కాగా.. తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయ్యింది.

priyanka-chopra-first-telugu-cinema-apurupam-details

తెలుగులో ప్రియాంక తొలి సినిమా..

కాగా చెర్రీతో చేసిన మూవీ డబ్బింగ్ కావడంతో ఇదే మహేష్ బాబుతో చేసే సినిమానే తొలి సినిమా అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రియాంక చోప్రా నిజానికి 2002లోనే ఒక తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఆ సినిమా పేరు "అపురూపం". సాయి రవి దర్శకత్వంలో ప్రసన్న హీరోగా రూపొందింది. ఈ చిత్రంలో ప్రియాంక పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు షూట్ చేయగా.. పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో ఆమె విడుదల కాబోయే మొదటి తెలుగు చిత్రం మహేష్ బాబుదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+