'పుష్ప'.. గోవిందా గోవింద... కనీసం కోటిరూపాయలు కూడా రాలేదు!

స్టైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేశారు. వచ్చే నెల ఐదోతేదీన ఇది విడుదల కాబోతోంది. తెలుగులోకన్నా హిందీ ప్రేక్షకులకు బాగా ఆదరించడంతో ట్రైలర్ విడుదల వేడుకను కూడా పాట్నాలో చేశారు. అలాగే పుష్ప2 సినిమాకు బాగా క్రేజ్ ఉన్న సమయంలోనే పుష్ప1 విడుదల చేసి మరింత క్రేజ్ తీసుకురావాలని నిర్మాతలు భావించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప1ను తిరిగి విడుదల చేయగా ఇప్పటివరకు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది. నవంబరు 22వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లోని థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది.

షారుక్ సినిమాకు మాత్రం మంచి కలెక్షన్లు
పుష్పతోపాటు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కలిసి నటించి ట్రెండ్ సెట్టర్ కరణ్ అర్జున్ సినిమాను కూడా తిరిగి విడుదల చేశారు. ఈ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. అయితే నవంబరు 15వ తేదీన రీరిలీజ్ అయిన షారుక్ ఖాన్ కల్ హోనాహో చిత్రం మాత్రం ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమా ఈరోజు వరకు రూ.3.70 కోట్లను రాబట్టింది. పుష్ప మొదటి భాగం కనీసం కోటిరూపాయలు కూడా రాబట్టలేకపోవడంపై నిర్మాతలు నిరాశ వ్యక్తం చేశారు. అయితే పుష్ప2పై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయని, రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడతామని, తొలిరోజే రూ.300 కోట్ల వరకు వస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Pushpa 1 failed to earn even a crore rupees in Hindi in its re-release

పడుతూ లేస్తూ సాగిన షూటింగ్
సుకుమార్ దర్శకత్వంలో మూడున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన పుష్ప2 చిత్రం షూటింగ్ పడుతూ లేస్తూ ముందుకు సాగింది. ఏ ముహూర్తాన దీనికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారో కానీ తాజాగా నిన్ననే గుమ్మడికాయ కొట్టి ముగించారు. సినిమాను సెన్సార్ కు పంపించారు. పంపించే ముందు అన్నపూర్ణ స్టూడియంలో ముఖ్యులకు షో వేసి చూపించడంతోపాటు సినిమా యూనిట్ కూడా చూసింది. దీనిపై అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీస్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో భారీగా విడుదల చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+