'పుష్ప 2'కు అవార్డుల పంట..క్లీన్‌స్వీప్ చేసిన 'పుష్పగాడు'..!
దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్ తెలుగు సినిమా వైభవానికి వేదికైంది. వైభవ్ జ్యువెలర్స్ మరియు కీన్ఫ్రా ప్రాపర్టీస్ సమర్పణలో అంగరంగ వైభవంగా జరిగిన 5వ గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (GAMA) వేడుకలు టాలీవుడ్ ప్రముఖుల సందడితో మెరిసిపోయాయి. జ్యూరీ చైర్మన్లు ఏ. కోదండ రామిరెడ్డి, కోటి, బి. గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రతిష్టాత్మక అవార్డులు గ్రహీతలకు అందజేశారు.
ఈ ఏడాది గామా అవార్డుల్లో 'పుష్ప 2 ది రూల్' ప్రభంజనం సృష్టించింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రంగా 'పుష్ప 2', ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ వంటి కీలక అవార్డులను కైవసం చేసుకుని, సినిమా విజయాన్ని మరోసారి చాటిచెప్పింది. అలాగే, 'లక్కీ భాస్కర్' చిత్రానికి గానూ మీనాక్షి చౌదరి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

ఈ వేడుకలో పలువురు ప్రముఖులకు ప్రత్యేక అవార్డులు లభించాయి. లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ అందుకోగా, 'గ్లోబల్ కమెడియన్'గా బ్రహ్మానందం ప్రత్యేక పురస్కారాన్ని స్వీకరించారు. కల్కి 2898AD చిత్రానికి ఉత్తమ నిర్మాతలుగా అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు అవార్డు అందుకున్నారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ, వేలాది మంది అభిమానుల మధ్య ఈ వేడుక నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. యాంకర్లు సుమ మరియు అతడు హర్ష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమానికి మరింత శోభను తీసుకొచ్చారు. హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, ఊర్వశీ రౌటెల, మానస వారణాసి తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. దుబాయ్ గడ్డపై జరిగిన ఈ వేడుక తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా పెంచింది.
గామా అవార్డు గ్రహీతలు:
బెస్ట్ యాక్టర్ 2024: అల్లు అర్జున్ ('పుష్ప 2 ది రూల్')
బెస్ట్ హీరోయిన్: మీనాక్షి చౌదరి ('లక్కీ భాస్కర్')
బెస్ట్ మూవీ: 'పుష్ప 2' (మైత్రి మూవీ మేకర్స్)
బెస్ట్ డైరెక్టర్: సుకుమార్ ('పుష్ప 2')
బెస్ట్ ప్రొడ్యూసర్: అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ ('కల్కి 2898 AD')
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీప్రసాద్ ('పుష్ప 2')
బెస్ట్ కొరియోగ్రఫీ: భాను మాస్టర్ ('నల్లంచు తెల్లచీర' - 'మిస్టర్ బచ్చన్')
బెస్ట్ సినిమాటోగ్రఫీ: రత్న వేలు ('దేవర')
బెస్ట్ ఎడిటర్: నవీన్ నూలి ('లక్కీ భాస్కర్')
బెస్ట్ లిరిసిస్ట్: రామ జోగయ్య శాస్త్రి ('చుట్టమల్లే' - 'దేవర')
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్): మంగ్లీ ('కళ్యాణి వచ్చావచ్చా' - 'ఫ్యామిలీ స్టార్')
గ్లోబల్ కమెడియన్ స్పెషల్ అవార్డు: బ్రహ్మానందం
లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు: అశ్వినీ దత్
ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్: ఊర్వశీ రౌటెల
-
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేస్తుంది..గూస్బంప్స్ గ్యారెంటీ బాసూ -
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ??












Click it and Unblock the Notifications