పుష్ప ది రూల్: గంగమ్మగా అల్లు అర్జున్ టీజర్ రిలీజ్.. ఒళ్ళు గగుర్పొడిచేలా.. తగ్గేదేలే!
ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే గిఫ్ట్ గా పుష్ప 2 సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న కథానాయికగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంపై అల్లు అర్జున్ అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.
గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ సీన్ టీజర్
పుష్ప 1 సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో, అంతకు మించి పుష్ప 2 పైన అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో చిత్రీకరించిన గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ గంగమ్మ గా కనిపించిన వీడియోను టీజర్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

గంగమ్మగా ఒళ్ళు గగుర్పొడిచేలా అల్లు అర్జున్ యాక్షన్
ఈ టీజర్ లో అల్లు అర్జున్ గంగమ్మగా బ్లూ కలర్ చీర కట్టుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని మెడలో నిమ్మకాయల దండతో, అదిరిపోయే హావభావాలతో అభిమానులకు విజువల్ ఫీస్ట్ ను ఇచ్చాడు. ఈ సీన్ ప్రేక్షకులకు ఒళ్ళు గగుర్పాటు కలిగేలా ఉంది. ఈ సీన్ మాత్రమే కాదు సినిమా మొత్తాన్ని అదే రేంజ్ లో తగ్గేదే లే అన్నట్టు చిత్రీకరించినట్టుగా దీనిని చూసిన అభిమానులు ఫీలవుతున్నారు. ఇలాంటి సన్నివేశాలు పుష్ప 2లో చాలానే ఉంటాయని అంచనా.
Massive ❤️💥#HappyBirthdayAlluArjun #Pushpa2TheRuleTeaser #PushpaMassJaathara pic.twitter.com/yT4jxQJ8li
— RAM ❤️🔥 DHFM'_____4 😉 (@_Sri_Ram_14__) April 8, 2024
అల్లు అర్జున్ పుట్టినరోజున సర్ప్రైజ్ గిఫ్ట్
పుష్ప ది రూల్ చిత్ర బృందం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఈ స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ అల్లు అర్జున్ అభిమానులకు పూనకాలు వచ్చేలా చేస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో పుష్ప ది రైజ్ చిత్రం తెరకెక్కింది. 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
పుష్ప ది రూల్ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్
ఎర్రచందనం కూలీగా మొదలైన పుష్ప ప్రస్థానం స్మగ్లింగ్ సిండికేట్ కు నాయకుడిగా ఎలా సాగిందో పుష్ప ది రైజ్ సినిమాలో చూపించగా, సిండికేట్ లీడర్ అయిన తర్వాత పుష్పకు ఎదురైన సవాళ్లు ఏమిటి? దాక్షాయిణి నుంచి పుష్ప కు ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది? ఈ సినిమాలో ఊహించని సూపర్ సన్నివేశాలతో ఉత్కంఠను రేకెత్తించేలా పుష్ప ది రూల్ సిద్ధం అవుతోంది. 2024 ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. మొత్తానికి బర్త్ డే బాయ్ బన్నీకి పుష్ప 2 సినిమా బృందం సూపర్ బహుమతినిచ్చింది.












Click it and Unblock the Notifications