పుష్ప2 వ్యూస్ మొత్తం పెయిడ్ వ్యూసే.. రూ.లక్షల్లో ఖర్చు?

సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం పుష్ప 2. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. రష్మిక కథానాయిక కాగా, దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. తెలుగులోకన్నా నార్త్ బెల్టులోనే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. పుష్ప 1 అనూహ్యంగా తెలుగుకన్నా బాలీవుడ్ లోనే ఘనవిజయం సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా పుష్ప2 నుంచి టీజర్, పోస్టర్, ఫస్ట్ సింగిల్ విడుదలయ్యాయి. వీటికి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ట్రెండింగ్ లోకి తీసుకురావాలని
ఈ సినిమాకు సంబంధించి పరిశ్రమలో ఒక వార్త వైరల్ గా మారింది. వాస్తవానికి ఏ సినిమా నుంచైనా పాటకానీ, సింగిల్ కానీ, టీజర్ కానీ.. ఇలా ఏది విడుదలైనా యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సంపాదించుకుంటాయి. ఒక ట్రెండ్ ను సృష్టిస్తాయి. ఇలా వ్యూస్ వచ్చాయంటే అర్థం.. ప్రేక్షకులను అవి విపరీతంగా ఆకట్టుకున్నాయని. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప పుష్పరాజ్ పాటను విడుదల చేశారు. దీన్ని యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి తీసుకువచ్చి వ్యూస్ తెప్పించడం కోసం నిర్మాతలు ఇప్పటివరకు లక్షలాది రూపాయలు ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకా ఇంకా ఖర్చుపెడతారని తెలుస్తోంది.

Pushpa2 views are all paid views in youtube

అంత అవసరం ఏమిటి?
పెయిడ్ ప్రమోషన్స్ అనేవి చిన్న సినిమాల కోసం వాడుతుంటారు. అయితే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాకు కూడా పెయిడ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వ్యూస్ పెరిగితే రికార్డ్ సృష్టించవచ్చు. కంటెంట్ ను నమ్ముకోవాలికానీ ఇలా లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వ్యూస్ పెరిగేలా చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందంటున్నారు. ఈ విషయంలో నిర్మాతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఇంకా ఖర్చు పెట్టాలనుకోవడానికి కారణమేంటని బన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+