ఒకప్పుడు ఐఏఎస్..ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కత్తిలాంటి హీరోయిన్

డాక్టర్ కాబోయి..యాక్టర్ అయ్యాను అనే సామేత చాలాకాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. కానీ ఓ హీరోయిన్ కలెక్టర్ కాబోయి హీరోయిన్‌గా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. రాశి ఖన్నా.అవును ఇది నిజం. రాశి ఖన్నా కలెక్టర్ కాబోయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే...రాశి ఖన్నా 1990 నవంబరు 30న న్యూఢిల్లీలో జన్మించారు. రాశి ఖన్నా మొదటి నుంచి కూడా బ్రిలియంట్ స్టూడెంట్.స్కూల్లో , కాలేజీలో టాపర్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాశి ఖన్నా,తొలుత ఉద్యోగం చేయలని భావించింది.

అందుకే కలెక్టర్ చదవాలని కోరుకుంది. కొంతకాలం ట్రైనింగ్ తీసుకొని పరీక్షలు కూడా రాసింది. కానీ విఫలం అవ్వడంతో ఆ తర్వాత నటనపై ఆసక్తి పెంచుకొని సినీ రంగం వైపు అడుగులు వేసింది.రాశి ఖన్నా తెలుగు, తమిళం , హిందీ సినిమాలలో నటించారు.ఆమె తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైంది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.

Raashi Khanna became an actress after initially wanting to become an IAS officer

'జోరు','జిల్','బెంగాల్ టైగర్', 'శివం', 'సుప్రీం', 'హైపర్', 'జై లవ కుశ', , 'టచ్ చేసి చూడు', 'తొలిప్రేమ', 'శ్రీనివాస కళ్యాణం' తదితర సినిమాల్లో నటించారు.అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్ రాశి ఖన్నా సొంతం. కెరీర్ స్టార్ చేసి పుష్కరకాలం అయినప్పటికీ అమ్మడు కెరీర్‌లో పెద్దగా హిట్లు లేవనే చెప్పాలి. కారణాలు తెలియదు కానీ స్టార్ హీరోలతో నటించే అవకాశం రాశి ఖన్నాకు దక్కలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ మినయిస్తే మిగిలిన హీరోలెవ్వరూ కూడా రాశి ఖన్నా వైపు కన్నెత్తి చూడలేదు.

ఇక సెకండ్ గ్రేడ్ హీరోలతో రాశి ఖన్నా నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్‌ బాట పట్టిన ఈ అమ్మడుకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. బాలీవుడ్‌లో బికినీ, లిప్‌లాక్ వంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ పెద్దగా లాభం లేకపోయింది.రాశి ఖన్నా ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్‌తో పాటు యోధ సినిమాలో యాక్ట్ చేస్తోంది. తెలుగులో పద్దతి కనిపించే రాశి ఖన్నా..బాలీవుడ్‌లో మాత్రం హాట్‌గా కనిపిస్తోంది. అక్కడి హీరోలతో లిప్‌లాక్‌‌‌లు ఇస్తూ రెచ్చిపోతుంది. ఇలా ఐఏఎస్ కావాల్సిన రాశి ఖన్నా హీరోయిన్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+