అనసూయలా బాత్ రూం సీన్లు ..మందు కొట్టే సీన్లు నేను చేయలేను

యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు, ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. బుల్లితెరపై తన మాటలతో, అద్భుతమైన డ్రెస్సింగ్‌ సెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'జబర్దస్త్' షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అనసూయ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు, నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత 'క్షణం', 'పుష్ప', 'యాత్ర' కథనం , దర్జా,ఖిలాడి,విమానం,రంగమార్తాండ,పెదకాపు-1, మైఖేల్, వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి, ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Raasi s Revelation Why She Rejected Rangamma Atta Role and How Anasuya Stole the Show

అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది.40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.

గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా అనసూయ గురించి సీనియర్ హీరోయిన్ రాశి ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

రాశి మాట్లాడుతూ.. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్ర కోసం మొదట తననే సంప్రదించారని చెప్పుకొచ్చింది. అయితే చీర థైస్ వరకు కట్టడం , మందు సీన్లు చేయడం తన వల్ల కాదని ఆ సినిమా నుంచి తప్పుకున్నానని రాశి చెప్పుకొచ్చారు. నా బదులు చేసిన అనసూయ రంగమ్మత్త పాత్రలో బాగా నటించారు. బహుశ నేను చేసిన అంత బాగా యాక్ట్ చేయకపోవచ్చని, ఆ పాత్రకు అనసూయ సరిగ్గా సరిపోయారని రాశి ఈ సందర్భంగా వెల్లడించారు. రంగమ్మత్త పాత్రతో అనసూయ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం అనసూయ గురించి రాశి మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+