లోకేష్ ర్యాంపేజ్ మామ.. రజినీకాంత్, నాగార్జున "కూలీ" ట్రైలర్ రిలీజ్ !
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, బాహుబలి ఫేమ్ సత్యరాజ్.. శృతి హాసన్, పూజా హెగ్డే ముఖ్యపాత్రలు పోషించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్ క్రియేట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్.
ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు కాబోతుంది ఈ చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్. ఈ మేరకు ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

బొమ్మ బ్లాక్ బస్టర్..
తాజాగా విడుదలైన 'కూలీ' ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. 3 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ ట్రైలర్.. సౌబిన్ షాహిర్ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నాగార్జున వాయిస్ ఓవర్ తో అదరగొట్టారు. ట్రైలర్ మొత్తం యాక్షన్, ఎమోషన్, మిస్టరీ, రివేంజ్ థీమ్‌లు కలిపినట్టు ఉంది.
రజనీ మాస్ క్యారెక్టర్ గా చూపించే ప్రయత్నం చేశాడు లోకేష్. అలానే నాగార్జున, అమీర్ ఖాన్ కూడా అదరగొట్టేశారు. అయితే ట్రైలర్‌లో ఉపేంద్ర పాత్రను పెద్దగా రివీల్ చేయకపోవడం కాస్త మిస్టరీగా మారింది. బీభత్సమైన BGM లేకుండా, అనిరుధ్ వాయిస్ ఓవర్‌తో చూపించడం.. ట్రైలర్‌కు కొత్తదనాన్ని తీసుకొచ్చింది.
చూడాలి మరి ఈ సినిమాతో లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ మ్యాజిక్ చేస్తారా లేదా అని. కింగ్ నాగార్జున నెగటివ్ షేడ్, ఉపేంద్ర మిస్టరీ రోల్ కూడా సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతున్నాయి. ఈ చిత్రం ఒక 2025 ఇండస్ట్రీ హిట్ అవుతుందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications