నాగార్జునపై చేయి చేసుకున్న రజనీకాంత్

తమిళంలోనే రజనీకాంత్ సూపర్ స్టార్ కాదు. దక్షిణ భారతదేశంలోనే సూపర్ స్టార్. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న రజనీకాంత్ జైలర్, వేట్టయన్ సినిమాలతో మరోసారి తన స్టామినాను నిరూపించాడు. 73 సంవత్సరాల వయసులో కూడా తనకు ఎదురులేదని నిరూపిస్తున్నాడు. తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. నటసామ్రాట్ అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్ లో తొలిసారిగా విలన్ గా నటిస్తున్నారు. తనను తాను విలన్ గా నిరూపించుకోవడానికి, ఒక ప్రత్యేకమైన విలక్షణత ఉన్న నటుడిగా నిరూపించుకోవడానికే ఈ పాత్రను ఎంచుకున్నట్లు నాగార్జున తెలిపారు.

క్లైమాక్స్ లో రజనీ చేతిలో దెబ్బలు తిన్న నాగార్జున
సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు కాబట్టి రజనీకాంత్, నాగార్జున మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతున్నట్లు లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా మీద లోకేష్ భారీగా కసరత్తులు చేస్తున్నాడు. కావాలనే ఏరికోరి నాగార్జునను తీసుకున్నాడు. అతనిచేత కొత్తరకం విలనిజాన్ని పండించడానికి లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా రజనీకాంత్, నాగార్జున మధ్య క్లైమాక్స్ ఫైట్ తీశారు. అందులో భాగంగానే రజనీ నాగార్జునను కొడతాడు. తమిళ మీడియాలో నాగార్జునను కొట్టిన రజనీకాంత్ అంటూ భారీగా వార్తలు వచ్చాయి. రజనీకాంత్ చేతిలో నాగార్జున దెబ్బలు తిన్నాడంటే అతి కథలో భాగంగా సినిమాలో జరిగిన విషయమే అని తేలిపోయింది.

Rajinikanth hit Nagarjuna in the climax of Coolie movie

నాగ్ నటనలో కొత్త కోణం
ఒక స్టార్ హీరోగా వెలుగుతున్న నాగార్జున విలన్ గా తన నటనలోని కొత్త కోణాన్ని వెలికి తీయాలని నిశ్చయించుకొనే ఈ పాత్రను ఎంచుకున్నారు. దీంతోపాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా నాగ్ నటిస్తున్నాడు. ఇందులో ధనుష్, రష్మిక ఇతర పాత్రలు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత తన వందో సినిమాను భారీ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలున్నాయి. మంచి దర్శకుల కోసం నాగార్జున ఎదురుచూస్తున్నారు. అయితే కొంతమంది దర్శకులు కథలు చెప్పారుకానీ నాగార్జున వాటిని పెండింగ్ లో పెట్టారు. కెరీర్ లో మరిచిపోలేని విధంగా తన వందో సినిమా ఉండాలని నాగ్ భావిస్తున్నాడు. సోలో హీరోగా చేద్దామా? మల్టీస్టారర్ చేద్దామా? అనే యోచనలో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+