రజినీకాంత్ లాల్ సలాం ఆడియో లాంఛ్ కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే తలైవా ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండుగ అని చెప్పాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలాం సినిమా ఇందులో ఒకటి. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను చాలా భిన్నంగా వినూత్నంగా చూపిస్తున్నారని టాక్ ఉంది.
ఇప్పటికే లాల్ సలాం సినిమాపై లాంచ్ చేసిన టైటిల్ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తోంది. సినిమాపై ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ఎలా ఉంటుంది? రజనీకాంత్ రోల్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? అన్నది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తుంది.

అయితే ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ కు సంబంధించి కూడా న్యూ లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ సినిమా ద్వారా మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్న చిత్ర యూనిట్, ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని చెబుతుంది.
ఇక ఈ సినిమాలో పాటలు కూడా అదిరిపోతాయి అని చెబుతున్న చిత్ర యూనిట్ ఆడియో లాంచ్ ఈవెంట్ ను ఫైనల్ చేసింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను చెబుతూ.. వేడుక కోసం వేచి చూడండి.. చెన్నైలోని శ్రీ సాయిరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జనవరి 26న శుక్రవారం గణతంత్ర దినోత్సవం నాడే స్టార్ సెలబ్రిటీలతో లాల్ సలాం గ్రాండ్ ఆడియో లాంచ్ ఉండబోతుంది.
'THER THIRUVIZHA' from Lal Salaam is here to kickstart the festive vibes! ☀️🌾✨ Let the rural beats ignite the celebration! 🥁🔥✨#TherThiruvizhaOUTNOW ▶️ https://t.co/4BN3YUHM3v
— Lyca Productions (@LycaProductions) December 18, 2023
An @arrahman musical 🎶
Singers 🎤 @Shankar_Live @RaihanahShekar @deepthisings @iamyogi_se… pic.twitter.com/CRNArPqh8s
ఏఆర్ రెహమాన్ కాంపొజిషన్ లో మరో క్లాసిక్ ఆల్బమ్ కోసం రెడీగా ఉండండి.. అంటూ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో, సుభాస్కరణ్ నిర్మాణ సారధ్యంలో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై, తండ్రి కూతుర్ల కాంబినేషన్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రస్తుతం ఈ సినిమా పై ఉంది. 3 సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య రజినీకాంత్ వాయ్ రాజా వాయ్, సినిమా వీరన్ వంటి చిత్రాలను తెరకెక్కించారు.












Click it and Unblock the Notifications