రూ.2 చేతిలో పెట్టి నీకున్న అహంకారం ఎవరికీ లేదన్నాడు.. బాధతో కన్నీళ్లు ఆగలేదు !

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'కూలీ', ఆగస్టు 14, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని స్టార్ నటులు కలిసి నటిస్తున్నారు. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్.. తమిళ నటుడు సీనియర్ నటుడు సత్యరాజ్ నటిస్తున్నారు.

ఈ భారీ బడ్జెట్ చిత్రం మొత్తం 370 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందుతుండగా.. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

rajinikanth-shocking-comments-at-his-speech-on-coolie-trailer-launch-event

ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్..

'కూలీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రజనీకాంత్ గతంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నారు. "ఒకరోజు రోడ్డుపై నిలబడి ఉండగా, ఓ వ్యక్తి తన లగేజ్‌ను టెంపో వరకూ మోయమన్నాడు. నేను ఒప్పుకున్నాను. అతన్ని గమనించి చూస్తే తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. కొద్ది సేపటికి అతను నా కాలేజ్ స్నేహితుడు అని గుర్తొచ్చింది. అప్పట్లో నేను అతన్ని ఆటపట్టించేవాడిని. లగేజ్ తీసుకెళ్లాక అతను నా చేతిలో రూ.2 పెట్టి అన్నాడు - 'నీ అహంకారం అప్పట్లో ఎలా ఉండేదో తెలుసా? ఆ రోజులు గుర్తున్నాయా?' అని అడిగాడు. అప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. నా జీవితంలో అది చాలా బాధ కలిగించిన రోజు" అంటూ తలైవా ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేష్ కనగరాజ్‌పై ప్రశంసలు..

ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను 'రియల్ హీరో'గా రజనీకాంత్ అభివర్ణించారు. "ఈ సినిమాకు నిజమైన హీరో లోకేష్. ఒక విజయవంతమైన కమర్షియల్ డైరెక్టర్‌తో పని చేయడం గొప్ప అనుభూతి. కథ చెప్పేందుకు వచ్చినప్పుడు 'సర్, నేను కమల్ ఫ్యాన్' అన్నారు. నేను 'నిన్ను అడిగానా?' అన్నాను. 'లేదు సర్, మామూలుగానే చెప్పాను' అన్నాడు. కథలో పంచ్ డైలాగ్స్ ఉండవని ముందే చెప్పారు. అప్పుడే నాకు ఇది ఒక ఇంటెన్స్ డ్రామా అని అర్థమైంది" అంటూ తలైవా గుర్తు చేశారు.

సత్యరాజ్ తో విభేదాలు..

సత్యరాజ్ గురించి రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సత్యరాజ్ తో నాకు విభేదాలు ఉన్నా, ఆయన నిజాయితీగా మాట్లాడగల గొప్ప వ్యక్తి. అలాంటి వారిని మనం నమ్మాలి. కానీ ప్రతి విషయం మనసులో పెట్టుకునే వారిని మాత్రం నమ్మకూడదు" అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

నాగార్జునపై ప్రశంసలు..

కింగ్ నాగార్జున ఈ వయసులోనూ ఆయన ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. నా జుట్టంతా ఊడిపోయింది, కానీ ఆయన యంగ్ లుక్ అద్భుతం. ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా, అద్వితీయంగా చేశారని అభిప్రాయపడ్డారు. ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ వ్యాయామమే అని తెలిపారు. చివరిగా ఒక సందేశం కూడా ఇచ్చారు. "ఎంత డబ్బు, పేరు వచ్చినా ఇంట్లో మనశ్శాంతి, బయట గౌరవం లేకపోతే జీవితం వ్యర్థమని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+