మద్యం మత్తులో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్ చల్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో నడి రోడ్డుపై హల్‌చల్ చేసింది. మద్యం తాగి ఫుల్ గా మత్తులో ఉండి కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టింది లావణ్య . అయినా ఆగకుండా పారిపోతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో జరిగింది.
తెలుగు యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ హీరో.. ఆ తర్వాత ఉయ్యాల జంపాల చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సినిమా చూపిస్త మామ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన పలు సినిమాల్లో హీరోగా నటించినా.. అవి బాక్సాఫీస్ వద్ద ఆశించినంత సక్సెస్ కాలేకపోయాయి.

అయితే రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య రోడ్డుపై రచ్చరచ్చ చేసింది. మద్యం మత్తులో కారు నడుపుతూ బైకును బలంగా ఢీకొట్టింది. అంతేకాకుండా కారు ఆపకుండా వెళ్ళిపోయేందుకు ప్రయత్నించగా ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. అయితే కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కిడివారితో లావణ్య గొడవ పెట్టుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మద్యం మత్తులో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్‌చల్!!
— Milagro Movies (@MilagroMovies) March 25, 2026
సంగారెడ్డి ముత్తపల్లిలో బైక్‌ను ఢీకొట్టి పరారయ్యే ప్రయత్నం… గ్రామస్తులు అడ్డుకున్నారు.#Rajtharun #Lavanya pic.twitter.com/TSHZfnLAIq
పోలీసులు.. లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. అందులో పాజిటివ్ అని వచ్చింది. దీంతో కారును సీజ్ చేసిన పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. అక్కడినుంచి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక కొంతకాలంగా లావణ్య వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications