ఎన్నికల బరిలో రామ్ చరణ్ హీరోయిన్..ఆ పార్టీ నుంచే బరిలోకి
సినిమావాళ్లు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో వస్తోన్న ఆనవాయితీ. దేశంలో చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్ నుంచి పవన్ కల్యాణ్ వరకూ చాలామంది నటులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక తమిళంలో అయితే హీరో, హీరోయిన్లుగా ఓ వెలిగిన వారు ఆ రాష్ట్రానికి సీఎంలుగా పని చేశారు.
నేటితరం నటులు సైతం చాలామంది చట్టసభల్లో అడుగుపెట్టారు. తాజాగా ఈ జాబితాలో మరో హీరోయిన్ చేరేలా కనిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు నేహా శర్మ. రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా చిరుతలో నేహా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ నేహా శర్మ కెరీర్‌కు అవి దోహదపడలేదు. దీంతో అవకాశాలు లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది ఈ బ్యూటీ.

అయితే ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతుంది. ఈ విషయాన్ని ఆమె తండ్రే స్వయంగా వెల్లడించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో నేహా శర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆమె తండ్రి అజయ్ శర్మ తెలిపారు. నేహా శర్మ తండ్రి అజయ్ శర్మ ప్రస్తుతం బీహార్‌లోని భాగల్‌పూర్ నియోజకర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆయన తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో తన కూతురు నేహా శర్మకు టికెట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బీహార్‌లో కాంగ్రెస్ -ఆర్జేడీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈక్రమంలో నేహా శర్మ తండ్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భాగల్‌పూర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. భాగల్‌పూర్ నియోజకర్గం నుంచి కచ్చింతంగా కాంగ్రెస్ పార్టీనే పోటీ చేయాలని నేను ఆశిస్తున్నా. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ మా పార్టీకి అవకాశం ఇస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తోంది. అధిష్టానం నన్ను పోటీ చేయాలని ఆదేశిస్తే కచ్చితంగా పోటీ చేస్తాను.. లేదా నా కుమార్తే నేహా శర్మ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు అని ఆయన తెలిపారు. దీనిపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అజయ్ శర్మ అన్నారు. దీంతో నేహా శర్మ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది.
-
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!












Click it and Unblock the Notifications