డబుల్ ఇస్మార్ట్ మూవీ ఫస్ట్ రివ్యూ..
రామ్ పోతినేని కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు వచ్చినట్లుగానే ఈ సినిమాకు కూడా ఏ సర్టిఫికెట్ దక్కింది. రెండు గంటల 42 నిముషాల రన్ టైమ్ తో ఈ సినిమా వచ్చింది. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పూరీ అభిమానులు, రామ్ అభిమానులు దీనిపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు. ఈనెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
సెన్సార్ టీం చెప్పినదాని ప్రకారం ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఏ థీమ్ అయితే పూరీ తీసుకున్నాడో అదే థీమ్ ను డబుల్ ఇస్మార్ట్ కు కూడా కొనసాగించాడు. లైగర్ సినిమా తర్వాత పూరీపై భారీగా ట్రోలింగ్ జరిగింది. ఈ సినిమా విడుదలకు ముందు కలెక్షన్ల లెక్క రూ.200 కోట్ల నుంచి ప్రారంభమవుతుందని ఆర్భాటంగా ప్రకటించాడు. ఆ సినిమా విడుదలైన తర్వాత రూ.100 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. తెలుగు రాష్ట్రాల్లో అసలు డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలవుతుందా? అనే సందేహం అందరిలో నెలకొంది.

వివాదాలన్నీ దాటుకొని గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా బీ, సీ సెంటర్లలో బాగా ఆడింది. దీంతో డబుల్ ఇస్మార్ట్ ను కూడా అక్కడి ప్రేక్షకులకు నచ్చేలా పూరీ తీర్చిదిద్దాడు. వాస్తవానికి పూరీ జగన్నాథ్ సినిమాలు అంటనే కథకన్నా హీరోను చూపించే విధానం, స్క్రీన్ ప్లేపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. డబుల్ ఇస్మార్ట్ కూడా అదే కోవలోకి వస్తుందని, హీరో రామ్ ను చూపించిన విధానం బాగుందని చెప్పారు. రామ్ పాత్రలో ఉండే భిన్నమైన అంశాలు అభిమానులకు బాగా నచ్చుతాయని భావిస్తున్నారు. దీనికి తోడు సంజయ్ దత్ క్యారెక్టర్ ను బాగా చూపించారని, ఆడియన్స్ అందరికీ ఈ పాత్ర బాగా నచ్చుతుందంటున్నారు.
పూరీ జగన్నాథ్ హైదరాబాద్ యాసతో డైలాగులు రాసుకున్నారని, వాటిని రామ్ కూడా చక్కగా పలికాడని, సినిమా ఇంటర్వెల్, క్లైమాక్స్ లో ట్విస్టులు అదిరిపోతాయంటున్నారు. పోరాట సన్నివేశాలతోపాటు సంగీతం బాగా వచ్చిందని, చాలా రోజుల తర్వాత పూరీ జగన్నాథ్ మంచి సినిమా తీశాడంటున్నారు. సెన్సార్ సభ్యులంతా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా జనాలకు బాగా చేరువైతే పూరీ జగన్నాథ్, ఛార్మీల తలరాత మారిపోతుందని, ఎన్నో రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరీ, రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లేనంటున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications