Ramcharan: డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్-చిరంజీవి, నాగబాబు రియాక్షన్స్ ఇవే..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇవాళ తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వేల్స్ యూనివర్శిటీ ప్రతినిధుల నుంచి రామ్ చరణ్ డాక్టరేట్ ను స్వీకరించారు. దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్తా ఇప్పుడు డాక్టర్ రామ్ చరణ్ గా మారారు. దీనిపై టాలీవుడ్ వర్గాలతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా స్పందించారు.
రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. వేల్స్ యూనివర్శిటీ తమిళనాడ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తున్న ప్రఖ్యాత విద్యాసంస్థ అని చిరంజీవి తెలిపారు. ఇది తనను ఓ తండ్రిగా ఎమోషనల్ గా, గర్వించేలా చేస్తుందని ఇదో ఉత్తేజకరమైన క్షణమని ఎక్స్ లో చిరు పోస్ట్ చేశారు. పిల్లలు వారి విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందమని చిరంజీవి పేర్కొన్నారు. రామ్ చరణ్ చాలా స్థిరత్వంతో ఇది సాధించాడని, మరింత ముందుకు, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్ అన్నారు.

Vels University Tamilnadu, the renowned academic institution bestowing an Honorary Doctorate on @AlwaysRamcharan makes me feel emotional and proud as a father. It is an exhilarating moment.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2024
True happiness for any parent is when the offspring outperforms their achievements. And… pic.twitter.com/OFuzYc80gq
రామ్ చరణ్ కు డాక్టరేట్ ఇవ్వడంపై ఆయన బాబాయ్ నాగబాబు కూడా స్పందించారు. తమిళనాడు కి చెందిన ప్రముఖ 'వెల్స్ యూనివర్సిటీ 'రామ్ చరణ్' ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారన్నారు. చిన్న వయసులోనే ఇలాంటి పురస్కారం అందుకున్నందుకు ఒక కుటుంబ సభ్యుడిగా సంతోషిస్తూ మరియు ఒక తెలుగువాడిగా గర్విస్తున్నానని ఎక్స్ లో తెలిపారు.
చరణ్ బాబు ఇలాంటి మరెన్నో కీర్తి శిఖరాలని అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
తమిళనాడు కి చెందిన ప్రముఖ 'వెల్స్ యూనివర్సిటీ 'రామ్ చరణ్' ని గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు,
— Naga Babu Konidela (@NagaBabuOffl) April 13, 2024
చిన్న వయసులోనే ఇలాంటి పురస్కారం అందుకున్నందుకు ఒక కుటుంబ సభ్యుడిగా సంతోషిస్తూ మరియు ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను.
చరణ్ బాబు ఇలాంటి మరెన్నో కీర్తి శిఖరాలని అధిరోహించాలని మనస్పూర్తిగా… pic.twitter.com/jjWu4CKx9V
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications