సమ్మర్ వెకెషన్ కోసం బ్యాంకాక్ వెళ్లిన రామ్‌చరణ్, ఉపాసన..
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్. ఆ సినిమాలోని తన నటనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమా తర్వాత రామ్‌చరణ్ బడా ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రం షూటింగ్ పనుల్లో గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ బిజిగా ఉన్నాడు. అయితే, ఈ బిడి షెడ్యూల్‌లో కాస్త గ్యాప్ వచ్చింది. దాంతో కుటుంబంతో కలిసి సమ్మర్ వెకెషన్ ట్రిప్ ప్లాన్ చేశాడు రామ్‌చరణ్. ఉపాసనతో కలిసి సమ్మర్ వెకేషన్ కోసం బ్యాంకాక్ వెళ్లాడు చరణ్. ప్రస్తుతం వీరి బ్యాంకాక్ ఫోటోలు కాస్త సోషల్‌మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
గేమ్‌ఛేంజర్ సినిమా షెడ్యూల్‌లో గ్యాప్ రావడంతో చరణ్, ఉపాసన కలిసి బ్యాంకాక్ వెకేషన్ కి వెళ్లారు. వీరిద్దరితోపాటు వీరి స్నేహితులు మరో రెండు జంటలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక, రామ్‌చరణ్ ఎక్కడికి వెళ్లినా, తనతో పాటు తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కపిల్ల రైమ్‌ను కూడా తీసుకెళతాడు. ఈ బ్యాంకాక్ ట్రిప్‌కి కూడా ఈ జంటతో పాటు రైమ్‌కూడా వెళ్లింది.

రామ్‌చరణ్ సమ్మర్ వెకేషన్‌కి వెళ్లేముందు ఫ్లైయిట్‌లో రామ్‌చరణ్, రైమ్ కూర్చుని ఉన్న ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు కాస్త ఇప్పడు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. ఇక, ట్రిప్‌కి వెళ్లాక అందరూ కలిసి దిగిన ఫోటోని రైమ్ సోషల్‌మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో చరణ్, ఉపాసనలతో పాటు వీరి స్నేహితులు బ్యాంకాక్ లో బీచ్ పక్కన ఉన్న ఓ రిసార్ట్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. వీరితో పాటు రైమ్ కూడా ఈ ఫోటోలు ఉంది. దీంతో ఈ ఫోటో ఇప్పడు సోషల్‌మీడియాలో ట్రెండ్‌గా మారింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా...
గేమ్‌ఛేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది మే కు పూర్తిచేసి, అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమాకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక, ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించే పనిలో ఉన్నారు మూవీ మేకర్స్.












Click it and Unblock the Notifications