ఈ‌ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్.. సెల్ఫ్ ఎలిమినేట్ ఎవరంటే !

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో "బిగ్ బాస్". ప్రస్తుతం ఈ 9వ సీజన్ లో తొమ్మిదో వారానికి వచ్చేసింది గేమ్. ఇక ఈ ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. అయితే ఈసారి ఈసారి మాత్రం అనూహ్యంగా ప్రేక్షకులకే కాదు.. బిగ్ బాస్ టీమ్ కి కూడా బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే లీక్ అయిన ఓటింగ్ లెక్కల ప్రకారం వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ ఈ వారం లీస్ట్ ఓటింగ్ పొందాడు. నామినేషన్‌లో ఉన్న వారిలో అతనికి అత్యల్ప ఓట్లు రావడంతో అతడే ఎలిమినేట్ అవుతాడన్న విషయం ఇప్పటికే లీకైంది. అయితే ఇక్కడే ఊహించని షాక్ చోటు చేసుకుంది.

ఎవరూ ఊహించని విధంగా రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో యాక్టివ్‌గా కనిపించిన రాము ఐదో వారం తర్వాత పూర్తిగా డల్ అయ్యాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత నుంచి అడపాదడపా గేమ్‌ లలో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాడు కానీ.. చాలాసార్లు గివ్ అప్ ఇచ్చేసి ఆటను వదిలేస్తున్నాడు. ఇక ఈ వారం అయితే ఇంట్లో వాళ్లు గుర్తొస్తున్నారు అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తూ వచ్చాడు.

ramu-rathod-eliminated-from-bigg-boss-telugu-season-9

ఇప్పుడు ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో రామును ప్రశ్నించగా.. ఇక హౌస్‌లో ఉండలేకపోతున్నానని ఇంటివాళ్లు గుర్తొస్తున్నారు అంటూ సెల్ఫ్ ఎలిమినేషన్ అడిగాడట. బిగ్ బాస్ టీమ్, నాగార్జున ఎంత నచ్చజెప్పినా కూడా రాము నిర్ణయం మార్చుకోలేదు. చివరికి బిగ్ బాస్ అతడి సెల్ఫ్ ఎలిమినేషన్‌ను ఆమోదించినట్లు తెలుస్తోంది. దాంతో రాము బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసినట్టు తెలుస్తోంది.

అయితే సోషల్ మీడియా వేదికగా రాము రాథోడ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అతడు గేమ్‌లో యాక్టివ్ కాకపోయినా, నిజాయితీగా ఆడేవాడు అని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఉండాలనే ఆసక్తి లేకుంటే బయటకే రావడం మంచిది అని మరికొందరు కామెంట్స్ రాసుకొస్తున్నారు. సాధారణంగానే బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి వారం కొత్త డ్రామా, కొత్త ట్విస్టులు వస్తుంటాయి. ఈ వారం రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్, సాయి శ్రీనివాస్ సేఫ్ అవడం మాత్రం నెక్స్ట్ లెవెల్ షాక్ అని భావిస్తున్నారు.

మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. ఆ ఓటింగ్ ప్రకారం చూస్తే ఎలిమినేట్ అయ్యే లిస్టులో సాయి శ్రీనివాస్ ఉన్నాడు. సాయి విషయానికి వస్తే అతడు గేమ్‌లో మంచి పోటీతత్వం చూపిస్తున్నాడు. గొడవలకో, ఫుటేజ్‌కో పోవడం లేదు. క్రమంగా అతడి ఆట ఇంప్రూవ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేశారో చూడాలి. అలానే తొమ్మిదో వారంలో హౌస్ కెప్టెన్‌గా ఇమ్మాన్యుయేల్ మరోసారి ఎంపికైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+