విజయ్ దేవరకొండ మహోగ్రరూపం.. 'రణబాలి' గ్లింప్స్ రిలీజ్..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ- దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు 'రణబాలి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. బ్రిటిష్ కాలంలో దేశ ప్రజలు ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, కరవు, వలసలు నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. టైటిల్ గ్లింప్స్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఆకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్. టైటిల్ గ్లింప్స్ చూస్తుంటేనే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం అవుతోంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. హిట్- ప్లాఫ్ టాక్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గతేడాది కింగ్డమ్ మూవీతో వచ్చిన విజయ్ దేవరకొండ.. తాజాగా రణబాలి చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు.
ఈ టైటిల్ గ్లింప్స్ లో బ్రిటిష్ ప్రభుత్వం ఆకృత్యాలు కరవు, ఆకలి కేకలు, వలసలు, మారణహోమం, అలాగే ఆనాటి ఆర్థిక, భౌగోలిక పరిస్థితులు, మరుగున పడిన చరిత్రను బయటకు తీసే ప్రయత్నం చేశారు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ రణబాలి అనే యోధుడి పాత్రలో నటిస్తున్నాడు. గ్లింప్స్ చివరిలో విజయ్ గుర్రంపై స్వారీ చేస్తూ ఓ బ్రిటిష్ అధికారుడ్ని తాళ్లతో ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు చూపించారు.

ఇక ఈ మూవీని సెప్టెంబర్ 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందాన్న కీలక పాత్రలో నటిస్తోంది.
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా












Click it and Unblock the Notifications