తండ్రి కాబోతున్న రామ్‌చరణ్ బ్రదర్.. మెగా ఫ్యాన్స్ పండగ
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆది పినిశెట్టిని రామ్ చరణ్ సోదరుడిగానే మెగా ఫ్యాన్స్ పరిగణిస్తారు. తాజాగా రామ్ చరణ్ బ్రదర్ తండ్రి కాబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఆది స్పందించాల్సి ఉంది. 2022లో నిక్కీని ఆది పినిశెట్టి ప్రేమించి పెళ్లాడాడు. తర్వాత తమ కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నిక్కీ గల్రానీ తన భర్తతో కలిసి దిగిన ఫొటోలు కొన్నింటిని షేర్ చేసింది.
ఆ ఫొటోలో పొట్ట కాస్త ఎత్తుగా కనిపిస్తోంది. దీంతో నిక్కీ గర్భిణీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఫొటోలు చూస్తున్నవారికి కూడా బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఎక్కడా ఆమె ప్రెగ్నెంట్ అన్నది మాత్రం మెన్షన్ చేయలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిక్కీ తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగులో కృష్ణాష్టమి సినిమా చేసింది. ఆది పినిశెట్టి కూడా మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. మలుపు, మరకతమణి సినిమాలతోపాటు రంగస్థలం, సరైనోడు సినిమాలు తెలుగులో ఆయన కెరీర్ కు మంచి ఊపునిచ్చాయి.

ప్రధానంగా రంగస్థలంలో నటించిన తర్వాత రామ్ చరణ్ సోదరుడిగానే గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ప్రస్తుతం చెర్రీ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ16 కూడా ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుంది. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ అని కొందరు చెబుతుండగా మరికొందరు కోడి రామ్మూర్తినాయుడి చరిత్ర అని చెబుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా తారక్ తో బుచ్చిబాబు చేద్దామనుకున్నాడుకానీ కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో రామ్ చరణ్ తో చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications