గత 10 ఏళ్లలో తెలుగులో భారీ డిజాస్టర్ మూవీ ఇదే
గత పదేళ్ల సగటుతో పోలిస్తే తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లతోపాటు ఇండస్ట్రీహిట్ సినిమాలు వచ్చాయి. వాటితోపాటు ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కొంతలో కొంత నయం అనిపించుకున్నాయి. చిన్న చిన్న నష్టాలతో నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను బయటపడేశాయి. అయితే పదేళ్ల సగటుతో పోలిస్తే తెలుగులో అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ఒకటుంది. ఇటీవలే అది విడుదలై దారుణ పరాజయంపాలైంది. అది ఏదో కాదు.. మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్.
మొదటిరోజు మొదటి ఆట వరకే..
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మిరపకాయ్ వచ్చి విజయవంతమైంది. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ విడుదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. సినిమా షూటింగ్ జరుపుకునే సమయంలో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మిక్కీజే మేయర్ సంగీతం అందించిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కూడా మెప్పు పొందాయి. చివరకు సినిమా మాత్రం బోల్తా కొట్టింది. మొదటిరోజు మొదటి ఆటవరకే ఈ సినిమా పరిమితమైంది. దారుణమైన రివ్యూలు రావడంతో థియేటర్ వైపు కన్నెత్తిచూసే నాథుడే లేడు. చివరకు ఈ సినిమా టోటల్ గా చేతులెత్తేసింది.

రూ.25 కోట్లకు పైగా నష్టాలు
నైజాంలో రూ.3.08 కోట్ల, సీడెడ్ లో 1.12 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 0.84, ఈస్ట్ 0.47, వెస్ట్ 0.37, గుంటూరు 0.54, కృష్ణా 0.37, నెల్లూరు 0.26 లక్షల రూపాయలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.7.05 కోట్లు, రెస్ట్ రూ.0.43, ఓవర్సీస్ రూ.0.58, ప్రపంచవ్యాప్తంగా రూ.8.06 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు రూ.33 కోట్ల థియేట్రికల్ వ్యాపారం జరిగింది. రూ.34 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యేది. చివరకు రూ.8.06 కోట్లతో సరిపెట్టుకుంది. రూ.25 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి భారీ డిజాస్టర్ గా పేరును మూటగట్టుకుంది మిస్టర్ బచ్చన్.
-
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications