ఐదు పూటల నమాజ్ చేస్తా.. వేరే మతం వాడిని ఎలా పెళ్లాడుతా?: స్టార్ హీరోయిన్

ప్రముఖ బాలీవుడ్ నటి రీమ్ షేక్ తన పెళ్లి, రిలేషన్ల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రీమ్ షేక్.. తాను వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించే ప్రసక్తే లేదని.. వివాహం కూడా చేసుకోనని స్పష్టం చేశాడు. తన మతాన్ని అనుసరించని వ్యక్తితో కలిసి జీవితాన్ని పంచుకోవడం తనకు సాధ్యం కాదని రీమ్ షేక్ తేల్చ చెప్పేసింది. దీనికి ప్రధాన కారణం తాను అత్యంత ధార్మిక వ్యక్తిత్వం కలిగి ఉండటమేనని రీమ్ షేక్ వెల్లడించారు.

రీమ్ షేక్ తన భక్తి గురించి వివరిస్తూ.. తాను రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తానని.. రంజాన్ మాసంలో ఖచ్చితంగా ఉపవాసాలు ఉంటానని వెల్లడించారు. తన జీవితంలో ఏవైనా కష్టసుఖాలు ఎదురైతే మొదట దేవుడికే మొరపెట్టుకుంటానని.. అటువంటి పరిస్థితుల్లో తన మతాన్ని గౌరవించని లేదా అనుసరించని వ్యక్తితో కలిసి ఉండటం తన వల్ల కాదని పేర్కొన్నారు. ఒకవేళ తాను మతాంతర వివాహం చేసుకుంటే సమాజం నుంచి చాలా విమర్శలు, తిట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని రీమ్ షేక్ అభిప్రాయపడింది.

Reem Shaikh on Interfaith Marriage Says I Pray 5 Times a Day Can t Marry Someone from Other Faith

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రీమ్ షేక్ తల్లిదండ్రులది మతాంతర వివాహం కావడం విశేషం. ఆమె తల్లి శీతల్ హిందూ కాగా.. తండ్రి ముస్లిం. వారి ఇంట్లో పూజలు, నమాజ్ రెండూ జరిగేవని రీమ్ షేక్ గుర్తు చేసుకున్నారు. అయితే తన తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని.. వారి మధ్య నిత్యం జరిగే గొడవలు, గృహ హింస కారణంగా తన చిన్నతనం చాలా భయంకరంగా గడిచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో జరిగిన ఆ సంఘటనల వల్ల తన మనసులో ఎంతో కోపం, భయం గూడుకట్టుకున్నాయని రీమ్ షేక్ వివరించారు.

ప్రస్తుతం రీమ్ షేక్ తల్లి రెండో వివాహం చేసుకున్నారు. తన సవతి సోదరితో రీమ్ షేక్ చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. వృత్తిపరమైన విషయానికి వస్తే.. రీమ్ షేక్ గతేడాది 'లాఫ్టర్ షెఫ్స్' వంటి షోలలో, కొన్ని వెబ్ సిరీస్‌లలో కనిపించారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. ఇప్పుడు తన వ్యక్తిగత విశ్వాసాల గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం బాలీవుడ్, టీవీ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+